చరిత్రలో ఈరోజు…

చరిత్రలో ఈరోజు.. మార్చి 6 .

గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 65వ రోజు (లీపు సంవత్సరములో 66వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 300 రోజులు మిగిలినవి.

సంఘటనలు..

2009: న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.

1992: కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం.

1983: అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం.

*🌻🌻జననాలు🌻🌻

1475: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (మ.1564)

1899: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949)

1902: కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు

1913: కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన హాస్యనటుడు. (మ.1966)

1919: గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.

1933: కృష్ణకుమారి, తెలుగు చలనచిత్ర నటి.

*🌹🌹మరణాలు🌹🌹*

1964: రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885)

1976: దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు.

1995: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902)

2016: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (జ.1971)

2019: కటికితల రామస్వామి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు. (జ.1932)

🌈పండుగలు , జాతీయ దినాలు.🌈
🔹 ఘనా గణతంత్ర దినోత్సవం.