చరిత్రలో ఈరోజు…

చరిత్రలో ఈరోజు..

* మార్చి 12

గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 71వ రోజు (లీపు సంవత్సరములో 72వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 294 రోజులు మిగిలినవి.

*సంఘటనలు.

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది

2007: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.

*🌻🌻జననాలు🌻🌻

1913: యశ్వంతరావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి.

1947: ఆలపాటి వెంకట మోహనగుప్త, వ్యంగ్య చిత్రకారుడు.

1954: దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు.

1975: వి.అనామిక, భారతీయ సమకాలీన కళాకారిణి.

*🌹🌹మరణాలు🌹🌹*

1976: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1896)

2017: భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1964)