చరిత్రలో ఈరోజు….

చరిత్రలో ఈరోజు..

*🌅 మార్చి 23 🌄*

 గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 82వ రోజు (లీపు సంవత్సరములో 83వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 283 రోజులు మిగిలినవి.

*🏞️సంఘటనలు🏞️*

1931 : భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్ (జ. 1907, రాజ్‌గురు (జ. 1908), సుఖ్‌దేవ్ (జ. 1907) లు ఉరి తీయబడ్డారు. వారి మరణాలకు గుర్తుగా ఆ రోజు అమరవీరుల దినొత్సవంగా గుర్తిస్తారు.

1942 : రెండవ ప్రపంచ యుద్ధంలో హిందూ మహాసముద్రములో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.

1956 : ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది. (పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం)

*🌻🌻జననాలు🌻🌻

1749: పియర్ సైమన్ లాప్లేస్, ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1827)

1893: భారతదేశ ఆవిష్కర్త, ఇంజనీర్ జి.డి.నాయుడు (మరణం:1974)

1910: రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త

1934: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (మ.2018)

1950: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.2016)

1953: అశోక్ దాస్, భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.

1968: మేకా శ్రీకాంత్, తెలుగు సినిమా నటుల్లో ఒకడు

*🌹🌹మరణాలు🌹🌹*

1931: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1907)

1931: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1907)

1931: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1908)

1992: ఫ్రెడరిక్ హేయక్, ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.

2015: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడు. (జ.1923)

2015: మల్లి మస్తాన్ బాబు, ప్రపంచ పర్వతారోహకుడు. (జ.1974)

🌈పండుగలు , జాతీయ దినాలు.🌈
🔹ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం.
🔹అమర వీరుల దినోత్సవం..