చరిత్రలో ఈ రోజు….

చరిత్రలో ఈ రోజు…
*2022 మార్చి 24..

*?️సంఘటనలు?*

?1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
1896 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.

?1977: భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీ విరమణ.

?1977: భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.

?1997: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ.

?1998: భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.

?1998: పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు.

?2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది.

*?జననాలు?*

?1775: ముత్తుస్వామి దీక్షితులు, భారత దేశానికి చెందిన కవి, రచయిత, వాగ్గేయకారుడు. (మ.1835)

?1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు.

?1984: ఆడ్రియన్ డీసౌజా, భారత హాకీ క్రీడాకారుడు.

*?మరణాలు?*

?1603: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (జ.1533)

?1963: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.

?1971: ఎర్రమల కొండప్ప, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1867)

?2016: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.1950)

?2017: గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి సంస్థ వ్యవస్థాపకుడు.

*??జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు*

*?ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం*