మహాభారతానికి సజీవ సాక్ష్యం.. అర్జునుడు గురువుకి దక్షిణ ఇచ్చిన ప్రాంతం ఎక్కడో తెలుసా..!

ఉత్తరప్రదేశ్ లోని…

బరేలి జిల్లాలోని రామనగర్ గ్రామం లో ఉంది.
అహిఛత్ర లేదా అహి క్షేత్ర…..
అహి అంటే సంస్కృతంలో నాగ లేదా పాము అని అర్ధం…..
అహిర్ లు అంటే సర్పారాధికులు ఉండే ప్రదేశం..

అందుకనే ఈ ప్రాంతానికి అహిఛత్ర లేదా అహి క్షేత్ర అనే పేరు వచ్చింది. అయితే ఇదంతా ఓ వెయ్యి సంవత్సరాలు లేదా 15 వందల సంవత్సరాల క్రితం మాట. కొందరు ఆర్కియాలజిస్టులు ఒకటవ శతాబ్దం మొదట్లో ఈ ప్రదేశాన్ని అహిఛత్ర లేదా అహి క్షేత్ర అని పిలిచేవారని చెపుతున్నారు.

పాండవుల వనవాసం సమయంలో శ్రీ కృష్ణుని సలహా మేరకు అర్జునుడు పాశుపాతాస్త్రం కోసం శివుని కోసం తపస్సు చేయగా అర్జునుడిని శివుడు పరీక్షించాలనుకున్నాడు. కిరాతకుడి రూపంలో వచ్చి అర్జునుడితో ద్వంద యుద్ధం చేస్తాడు. ఇది కిరాతార్జునీయంగా మనకి సూపరిచితమే ! శివుడు అర్జునుడికి పాశుపతం ఇచ్చిన ప్రదేశంలోనే అహిరులు ఈ కట్టడం కట్టారు. ఈ ప్రాంతాన్ని సుదీర్ఘ కాలం పాలించారు అహిరులు. ఇక్కడ తవ్వకాలలో దొరికిన శిల్పాలు, విగ్రహాలు లండన్ తో సహా మన దేశంలోని మ్యూజియంల్లో పెట్టారు. 3000 ఏళ్లు బిఫోర్ కామన్ ఎరా [3000 BCA] అప్పటి మహాభారత ము నిజమేనని చెప్పే సాక్ష్యాధారాల్లో ఇది మొదటి స్థానం లో ఉంటుంది.

విషాదం ఏమిటంటే ఇప్పుడు అదే రాంనగర్ ప్రాంత ప్రజలకి ఈ కట్టడం గురుంచి తెలియదు. స్వాతంత్యం వచ్చిన తరువాత కూడా పాలకుల నిర్లక్ష్యంతో మన చరిత్రను మనమే విస్మరిస్తున్నాం అని కొంతమంది చరిత్రకారులు ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు..3000 ఏళ్ల నాటి కట్టడం పురావస్తు శాఖ అధీనంలో ఉంది. అయితే ప్రచారం లేదు కనీసం టూరిస్ట్ కేంద్రంగా కూడా అభివృద్ధి చేయలేదు. ఇక్కడికి దగ్గరలోనే వనవాసం సందర్భంగా పాండవులు తవ్విన పెద్ద చెరువు ఇప్పటికీ ఉంది ఆలన పాలన లేకుండా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

గత చరిత్ర…

అయితే ఈ ప్రదేశం వేద కాలం నాటిది. మహాభారతము లో ద్రౌపది తండ్రి దృపదుడు పాలించిన పాంచాల దేశం ఇప్పటి బరేలీ ప్రాంతం. దృపదుడు అవమానించాడు అన్న కారణంగా ద్రోణాచార్యుడు పాండవులకి యుద్ధ విద్యలు నేర్పి.. అనంతరం గురుదక్షిణగా పాంచాల రాజు దృపడుని యుద్ధంలో ఓడించి దృపదుడి ని బంధించి తెమ్మని ప్రియ శిష్యుడైన అర్జునుడిని అడుగుతాడు.గురు దక్షిణగా అర్జునుడు దృపదుడి ని యుద్ధం లో ఓడించి.. అతనిని బంధించి తన గురువు ద్రోణాచార్యుడి పాదాల వద్ద పడేస్తాడు అర్జునుడు. అప్పటి నుండి పాంచాల దేశం ద్రోణాచార్యుడి ఆధీనం లో ఉంది. అయితే దృపదుడిని క్షమాభిక్ష పెట్టి వదిలేస్తాడు ద్రోణుడు. తరువాత దృపదుడు పాంచాల దేశానికి దక్షిణ దిక్కున కంపిల్యని రాజధానిగా చేసుకొని మిగతా రాజ్యాన్ని పాలించాడు. అర్జునుడు గురు దక్షిణగా ఇచ్చిన ఉత్తర పాంచాల దేశాన్ని ద్రోణాచార్యుని కుమారుడు అశ్వద్ధామ పాలించాడు దుర్యోధనుడికి సామంత రాజుగా. ఇది మనం మాహాభారతమ లో చదివినదే.అయితే మహాభారత కాలం తరువాత ఈ ప్రదేశం 2000 bc లో అహిర్ జాతి వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది. అప్పట్లో ఈ ప్రదేశము అతి పెద్ద నగరంగా ఉండేది. అయితే ఇక్కడ ఒక పెద్ద కట్టడం బయట పడ్డది. ఈ కట్టడం మొత్తం ఒక పెద్ద పిరమిడ్ ఆకారంలో ఉంటుంది పైన ఎత్తయిన శివుని విగ్రహం ఉంటుంది. ఇది ప్రస్తుతం రాంనగర్ అనే గ్రామంలో ఉంది. 12 వ శతాబ్దం లో ముస్లిం దండయాత్రల సమయంలో ఈ కట్టడం కూడా దాడికి గురైంది. అయినప్పటికీ ఈ కట్టడం ఇప్పటికీ చాలా ఎత్తులో ఉంది.. పైగా దాని మీద 22 మీటర్ల ఎత్తయిన శివ లింగం ఉంది. ఇది ఎంత పెద్దది అంటే మొత్తం 187 హెక్టార్ల స్థలంలో ఈ పిరమిడ్ నిర్మించబడింది…