చరిత్రలో ఈరోజు….

చరిత్రలో ఈరోజు మే 12న..

సంఘటనలు..

*0254:* పోప్ లూసియస్-I తరువాత పోప్ సెయింట్ స్టీఫెన్-I, 23వ కేథలిక్ పోప్ అయ్యాడు.

*1364:* ‘కాసిమిర్ III’, పోలాండ్ రాజు ‘జగీల్లోనియన్ యూనివర్సిటీ’ (పోలాండ్ లోని అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయం)ని నెలకొల్పమని, ‘రాజ పత్రం’ (రాయల్ ఛార్టర్) ఇచ్చాడు.

*1459:* ‘సన్ సిటీ ఇండియా’ గా పేరుగాంచిన జోధ్‌పూర్ ని, రాథోర్ (డ్) వంశానికి చెందిన, రాజ్‌పుట్ ప్రముఖుడు, ‘రావు జోధ్’ స్థాపించాడు.

*1701:* నెదర్లాండ్ లోని ‘డ్రెన్త్’ అనే ప్రాంతం గ్రెగొరియన్ కేలండర్ ని అమలు చేసింది (నిన్నటి రోజు తేది 1701 ఏప్రిల్ 29 నుంచి నేటి తేది 1701 మే 12 కి తేదీలు మారాయి. అంటే ఈ మధ్య రోజులు అన్నీ మాయమయ్యాయి అన్న మాట)

*1777:* మొట్టమొదటి ‘ఐస్ క్రీం’ ప్రకటన (ఫిలిప్ లెంజి – న్యూయార్క్ గెజెట్ లో ప్రకటించారు).

*1792:* నియమిత సమయంలో దానంతట అదే శుభ్రం చేసుకునే మరుగుదొడ్లు (టాయిలెట్స్ ఫ్లషింగ్) పేటెంటు హక్కులు పొందారు.

*1835:* ఛార్లెస్ డార్విన్ ఉత్తర ఛిలి దేశంలో ఉన్న రాగి గనులను చూడటానికి వెళ్లాడు.

*1908:* ‘నాథన్ బి. స్టబ్‌ల్‌ఫీల్డ్’ ‘వైర్‌లెస్ రేడియో ప్రసారానికి’ పేటెంట్ హక్కులు తీసుకున్నాడు.

*1915:* భారతదేశపు ప్రసిద్ధ విప్లవకారుడు రాస్బిహారీ బోస్ జపాన్ యాచ్‌లో భారతదేశాన్ని విడిచిపెట్టాడు.

*1921:* మొట్ట మొదటి ‘నేషనల్ హాస్పిటల్ డే’ ని అమెరికాలో జరుపుకున్నారు.

*1926:* బ్రిటన్‌లో కార్మిక సంఘాలు చేసిన 9 రోజుల సాధారణ సమ్మెను విరమించారు.

*1937:* కింగ్ జార్జి VI పట్టాభిషేకం గ్రేట్ బ్రిటన్లో జరిగింది.

*1942:* 1500 మంది యూదులను ‘ఆస్చ్‌విట్జ్ కాన్సెంట్రేషన్ కేంపు’ లో విషవాయువు ద్వారా చంపేసారు. ఈ కేంపు నాజీ జర్మనీ ఆక్రమించిన పోలాండ్ లో ఉంది.

*1942:* అమెరికాకు చెందిన రవాణానౌకను, మిస్సిసిపి నదీ ముఖద్వారం దగ్గర, నాజీ లకు చెందిన యు-బోటు ముంచేసింది.

*1943:* జర్మన్ సైన్యం, ఉత్తర ఆఫ్రికాలో లొంగిపోయింది.

*1846:* దురదృష్టకరమైన డోనర్ పార్టీ మిస్సౌరీలోని ఇండిపెండెన్స్‌ను విడిచిపెట్టి కాలిఫోర్నియాకు వెళ్లింది; కొన్ని నెలల తర్వాత ఈ బృందం సియెర్రా నెవాడాలో చిక్కుకుపోయింది మరియు ఆహారం అయిపోయినప్పుడు కొంతమంది సభ్యులు నరమాంస భక్షణను ఆశ్రయించారని నివేదించబడింది.

*1949:* అమెరికాలో మొట్ట మొదటి మహిళా రాయబారిగా శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ని భారతదేశం నియమించింది.

*1951:* మొదటి ఉదజని బాంబు (హైడ్రోజన్ బాంబు)ను ‘ఎనెవెటక్ అటోల్’ అనే చోట పరీక్షించారు.

*1952:* ‘గజ్ సింగ్’ జోధ్‌పూర్ మహారాజుగా కిరీట ధారణ జరిగింది.

*1956:*-తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) తీవ్రమైన తుఫాను, ఎత్తైన సముద్రపు అలలతో, అతలాకుతలమైంది.

*1965:* సోవియట్ యూనియన్ ప్రయోగించిన రోదసీనౌక లూనా 5 చంద్రుని నేల మీద నెమ్మదిగా దిగలేక కూలిపోయింది. ప్రయోగం విఫలమైంది.

*1982:* ‘యు.ఎస్. ఫుట్‌బాల్ లీగ్’ ఏర్పడింది.

*1984:* ఫ్రాన్స్ అణుబాంబును పరీక్షించింది.

*1984:* నెల్సన్ మండేలా,దక్షిణాఫ్రికాలో ఖైదు చేయబడిన 22 సంవత్సరాల తరువాత తన భార్యను చూసాడు.

*1986:* అమెరికాకు చెందిన ‘ఫ్రెడ్ మార్ఖం’ తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.

*1991:* పసిఫిక్ ప్రాంతపు వాయవ్య దిక్కులో దొరికే, అరుదైన మూలికతో కేన్సర్ వ్యాధికి ఒక కొత్త మందును కనుగొన్నారు.

*1992:* ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ ‘ఇన్‌గ్రిడ్ బేయెన్స్’.

*1997:* ఆస్ట్రేలియాకు చెందిన ‘సుసాన్ జీన్ (సుసీ) మరోనీ’ (22 సంవత్సరాలు),క్యూబా నుంచి ఫ్లోరిడా స్ట్రెయిట్స్ (అమెరికా) వరకూ (180 కి.మీ – 112 మైళ్ళు) ఈత కొట్టిన మొదటి మనిషి, మొదటి మహిళ. ఈమె సెరిబ్రల్ ఫాల్సీ వ్యాధితో పుట్టింది.

*2002:* మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 5 రోజుల క్యూబా పర్యటనకు వెళ్లాడు. 1959 లో, క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో తిరుగుబాటు చేసిన తరువాత పర్యటించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.

*2008:* చైనాలోని సిచుయాన్లో రెక్టర్ స్కేల్ మీద 8.0 మేగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం వచ్చి, 69,000 మంది మరణించారు.

*2010:* బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు.

*2010:* ‘ఆఫ్రిఖియా ఏర్‌వేస్’ కి చెందిన విమానం కూలి అందరూ మరణించారు ఒక్కడు తప్ప.

*2012:* భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయొజెనిక్ ఇంజిన్ ప్రయోగం సఫలమైంది. దీనిని, ఉపగ్రహ ప్రయోగ వాహకం జి.ఎస్.ఎల్.వి-డి5 లో బిగించుతారు. భారతదేశం, అమెరికాను ఈ ఇంజిన్లు అడిగినప్పుడు భారత దేశానికి ఇవ్వకుండగా, భారత దేశానికి అనేకమైన అడ్డంకులను కల్పించింది.

*2015:* భారీ నేపాల్ భూకంపం వల్ల 218 మంది మరణించారు మరియు 3500 మందికి పైగా గాయపడ్డారు.

*2019:* ఐపీఎల్ క్రికెట్ ఫైనల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్: ముంబై ఇండియన్స్ 1 పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.

*? జననాలు ?*

*1401:* షొకొ చక్రవర్తి, జపాన్ 101వ చక్రవర్తి (మ. 1428)

*1820:* ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (మ. 1910)

*1892:* రామన్‌లాల్ దేశాయ్ భారతీయ గుజరాతీ భాషా రచయిత.

*1895:* జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్వవేత్త. (మ. 1986)

*1899:* ఇంద్రా దేవి, లాట్వియన్ యోగా గురువు (మ. 2002)

*1907:* విజయ్ భట్ హిందీ సినిమాకి ప్రముఖ నిర్మాత-దర్శకుడు-స్క్రీన్ రైటర్.

*1920:* జగ్‌మోహన్‌లాల్ సిన్హా అలహాబాద్ హైకోర్టులో పనిచేసిన భారతీయ న్యాయమూర్తి.

*1920:* వింజమూరి అనసూయ, జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత

*1924:* షేక్ చిన మౌలానా కర్ణాటక సంప్రదాయంలో పురాణ నాధస్వరం వాద్యకారుడు.(మ.1999)

*1926:* భాట్టం శ్రీరామమూర్తి, జర్నలిస్టు, రాజకీయవేత్త.

*1933:*-నందు ఎం. నటేకర్, మాజీ భారత బ్యాడ్మింటన్ జాతీయ ఛాంపియన్.

*1937:* జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు,, రచయిత. (మ.2008)

*1945:* కెజి బాలకృష్ణన్ భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్‌పర్సన్. భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి.

*1948:* విపి సింగ్ బద్నోర్, పంజాబ్ 28వ మరియు ప్రస్తుత గవర్నర్‌గా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు.

*1950:* షోజొ ఫుజీ, జూడో ఛాంపియన్

*1951:* గున్నార్ లార్సన్ స్వీడెన్, 200 మీటర్లు / 400 మీటర్లు ఈతగాడు (1972 లో ఒలింపిక్ బంగారుపతకాన్ని గెలిచాడు).

*1954:* రాజాజీ మాథ్యూ థామస్, పాత్రికేయుడు మరియు త్రిసూర్ నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాజకీయ నాయకుడు.

*1976:* వికాస్ సేథి, భారతీయ నటుడు.

*1980:* సుమియర్ పస్రిచా, భారతీయ నటుడు మరియు హాస్యనటుడు.

*1983:* కాశీనాథ్ నాయక్, భారతీయ ప్రొఫెషనల్ జావెలిన్ త్రోయర్.

*1984:* ఫ్రెడ్డీ దారువాలా, ముంబైలో ఉన్న భారతీయ మోడల్ మరియు నటుడు.

*1986:* విను మోహన్, మలయాళ సినిమాల్లో నటించిన భారతీయ చలనచిత్ర నటుడు.

*1987:* అమృత ప్రకాష్, భారతీయ చలనచిత్ర నటి మరియు మోడల్.

*1992:* అదా ఖాన్, హిందీ, తెలుగు మరియు తమిళ చిత్రాలలో ప్రధానంగా కనిపించే భారతీయ చలనచిత్ర నటి.

? *మరణాలు* ?

*1871:* జాన్ ఎఫ్.డబ్లు. హెర్షెల్, బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త (నెబ్యులాలను కేటలాగ్ లో ప్రకటించాడు. (నక్షత్ర మేఘాల పట్టిక తయారుచేసిన వాడు)).

*1909:* హ్యూ హెన్రీ గోఫ్ సీనియర్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అధికారి.

*1922:* మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(జ.1868)

*1946:* ధారా వెంకట సుబ్బయ్య, భక్త ప్రహ్లాద, వేణీ సంహారం, భీష్మ నిర్యాణం, గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు మొదలైన నాటకలను రసవంతంగా ప్రదర్శించేవారు.

*1984:* రాజా ముత్తయ్య చెట్టియార్ ఒక భారతీయ బ్యాంకర్, రాజకీయవేత్త మరియు పరోపకారి.

*1993:* షంషేర్ సింగ్ ఆధునిక హిందీ కవిత్వంలో ప్రముఖ కవి

*2003:* ప్రిన్స్ సద్రుద్దిన్ ఆగా ఖాన్, ఫ్రెంచి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫొర్ రెఫ్యూజీస్ (కాందిశీకులకు) (జ.1933)

*2009:* గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1915)

*2014:* శరత్ పూజారి ఒడియా చిత్ర పరిశ్రమలో భారతీయ చలనచిత్ర నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.

? *పండుగలు, జాతీయ దినాలు* ?

*అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు.*

*’నేషనల్ హాస్పిటల్ డే’ ని 1921 నుంచి అమెరికాలో జరుపుకుంటున్నారు.*