చరిత్రలో ఈ రోజు…..

*🐚 మే 30 🐚*

గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 150వ రోజు (లీపు సంవత్సరములో 151వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 215 రోజులు మిగిలినవి.

*📀 సంఘటనలు 📀*

1962: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీలో ప్రారంభమయ్యాయి.

1987:30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు.

2008: కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.

*🎂🍬 జననాలు 🍬🎂

1903: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1973)

1921: కంచనపల్లి పెదవెంకటరామారావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.

1987: అల్లు శిరీష్, తెలుగు సినిమా నటుడు, అల్లు అరవింద్ కుమారుడు.

*🪔 మరణాలు 🪔*

1744: అలెగ్జాండర్ పోప్, పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (జ.1688)

2007: గుంటూరు శేషేంద్ర శర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

2010: బలరాం నందా, భారత చరిత్రకారుడు.

2017: దాసరి నారాయణరావు తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయనాయకుడు. (జ.1942)

🔔 పండుగలు , జాతీయ దినాలు 🔔
🔹గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం.