చరిత్రలో ఈ రోజు..

చరిత్రలో ఈ రోజు..

*🐚 జూన్ 1 🐚*

గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 152వ రోజు (లీపు సంవత్సరములో 153వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 213 రోజులు మిగిలినవి.

*📀 సంఘటనలు 📀*

అంతర్జాతీయ బాలల దినోత్సవం

1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చింది.

1930: భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి – పూణే ల మధ్య ప్రారంభించబడింది.

1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.

1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.

1978: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అర్జెంటీనాలో ప్రారంభమయ్యాయి.

1979: విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979, జూన్ 1న విజయనగరం జిల్లా అవతరించింది.

1981: జనరల్ కె.వి. కృష్ణారావు భారత దేశము కు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

1996: భారత ప్రధానమంత్రిగా దేవెగౌడ నియమితుడైనాడు.

2001: నేపాల్ రాజప్రాసాదంలో రాజకుటుంబం హత్య

*🎂🍬 జననాలు 🍬🎂

1891: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)

1926: మార్లిన్ మన్రో, హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)

1940: ఎస్.ఎ.కె.దుర్గ, సంగీత విద్వాంసురాలు.

1944: జరుగుల వెంకట రామ భూపాలరావు వృక్ష శాస్త్రవేత్త.

1946: బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. “బాబు” అన్నది అతని కలం (కుంచె) పేరు

1950 : కలిదిండి బి.ఆర్. వర్మ, భారతీయ భౌతికశాస్త్రవేత్త.

1952: సబ్బం హరి, రాజకీయనాయకుడు

1953: బలరామయ్య గుమ్మళ్ళ, మాజీ కలెక్టర్, వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన నటుడు కూడా.

1958: గుమ్మా సాంబశివరావు, ఆధునిక తెలుగు కవి.

1964: ఎస్. వి. కృష్ణారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి.

1974: ఆకెళ్ళ రాఘవేంద్ర, రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.

1975: కరణం మల్లేశ్వరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.

*🪔 మరణాలు 🪔*

1868: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)

1961: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు (జ.1879).

1968: హెలెన్ కెల్లర్,అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథి (జ.1880).

1996: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి (జ.1913).

2001: బీరేంద్ర, నేపాల్ రాజు (జ.1972).

🔔 పండుగలు , జాతీయ దినాలు 🔔
🔹అంతర్జాతీయ బాలల దినోత్సవం
🔹ప్రపంచ పాల దినోత్సవం.