చరిత్రలో ఈ రోజు..

చరిత్రలో ఈ రోజు..

జూన్ 2 ..

గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 153వ రోజు (లీపు సంవత్సరములో 154వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 212 రోజులు మిగిలినవి.

*📀 సంఘటనలు 📀*

1806: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.

1953: యునైటెడ్ కింగ్‌డమ్ కు మహారాణిగా రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం

1910: చార్లెస్ రోల్స్ – ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోనిలిచిన రోజు.

2014: భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ.

2014: భారతదేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ.

*🎂🍬 జననాలు 🍬🎂

1889: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928)

1897: కొత్త భావయ్య, చారిత్రక పరిశోధకుడు (మ.1973).

1939: విష్ణు నారాయణ్ నంబూత్రి, మలయాళ కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.

1943: ఇళయరాజా, భారత గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు.

1956: మణిరత్నం, భారతదేశ సినిమా దర్శకుడు.

1961: యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు.

1975: ఉత్తేజ్, తెలుగు సినిమా హస్యనటుడు, రచయిత.

1988: హేమచంద్ర, తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్య గాయకుడు.

మరణాలు *

1882: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (జ.1807)

1988: రాజ్‌ కపూర్, భారతదేశ హిందీ నటుడు, దర్శకుడు, నిర్మాత మరణం. (జ.1924)

పండుగలు , జాతీయ దినాలు.
🔹తెలంగాణ అవతరణ దినోత్సవం