*2022 జులై 22?*
*?️సంఘటనలు?*
?1963 : బీటిల్స్ (నలుగురు గాయకుల గుంపు) ‘ఇంట్రడ్యూసింగ్ ది బీటిల్స్’ అనే మొదటి ఆల్బంని విడుదల చేసారు.
?1969 : యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) స్పుత్న్కి 50, మొల్నియల్-12 అనే రెండు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది.
?1972 : రష్యా ప్రయోగించిన వెనెరా 8 పేరు గల రోదసీ నౌక శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగింది.
?1983 : డిక్ స్మిత్ హెలికాప్టర్ మీద ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి వ్యక్తి.
?1987 : సోయుజ్ టి.ఎమ్-3 అనే రోదసీ నౌకను ముగ్గురు రోదసీయాత్రికులతో (అందులో ఒకడు సిరియా దేశస్థుడు) రష్యా ప్రయోగించింది.
?1988 : ఫ్రెంచి గయానా (కౌరు) నుంచి ఇన్సాట్ 1-సి ప్రయోగించారు.
?1999 : మైక్రోసాప్ట్ కంపెనీ ఎమ్.ఎస్.ఎన్. మెసెంజర్ మొదటి వెర్షన్ (మొదటి తరం) ని విడుదల చేసింది.
*?జననాలు?*
?1822: గ్రెగర్ మెండల్, జన్యుశాస్త్రం లో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (మ.1884)
?1887: గుస్టావ్ లుడ్విగ్ హెర్ట్‌జ్, జర్మన్ క్వాంటమ్ శాస్త్రవేత్త (1925 లో నోబెల్ బహుమతి గ్రహీత). ఇతని బంధువైన హీన్‌రిఛ్ రుడాల్ఫ్ హెర్ట్‌జ్ పేరుతో రేడియో తరంగాలకు (హెర్ట్‌జ్) గా పేరు పెట్టారు.
?1916: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (మ.1977)
?1923: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (మ.1976)
?1922: పుట్టపర్తి కనకమ్మ, సంస్కృతాంధ్ర కవయిత్రి, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు భార్య. (మ.1983)
?1925: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (మ.1987)
?1940: యూరి పి అర్త్యుఖిన్, రోదసీయాత్రికుడు (సోయుజ్ 14).
?1965: రాగతి పండరీబాయి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (మ.2015).
?1959: బోయినపల్లి వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యుడు, న్యాయవాది.
?2002: నకరకంటి దివ్య, ముకుందపురం, సూర్యపేట జిల్లా, తెలంగాణ.
*?మరణాలు?*
?1826: గియుసెప్పె పియజ్జి, మొదటి గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్న శాస్త్రవేత్త.
?1987: ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (జ.1933)
?2003: ‘ఉదయ్’, ఖుసే హుస్సేన్’, సద్దాం హుస్సేన్ కుమారులు. ఉత్తర ఇరాక్ లో జరిగిన యుద్ధంలో, తుపాకీ కాల్పులకు మరణించారని అమెరికా ప్రకటించింది.
*??జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు?*
*?1944: పోలండ్ జాతీయదినోత్సవం*
*?మ్యాంగో డే*