చరిత్రలో ఈ రోజు..

జులై 26.

, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 207వ రోజు (లీపు సంవత్సరములో 208వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 158 రోజులు మిగిలినవి.

*? సంఘటనలు ?*

1956: గమాల్ అబ్దుల్ నాసర్, ఈజిప్ట్ అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేసాడు.

1997: వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం.

*?? జననాలు ??

1915: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు.

1927: గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. (మ.2003)

1935: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010)

*? మరణాలు ?*

1930: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (జ.1856)

1975: గోపరాజు రామచంద్రరావు, సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (జ.1902)

2011: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు. ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త. (జ.1929)

2012: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1924)

2020: గార్లపాటి రఘుపతిరెడ్డి, తెలంగాణా విముక్తి పోరాటయోధుడు.

2021: జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (జ. 1945)

? పండుగలు , జాతీయ దినాలు ?
?కార్గిల్ విజయ దినోత్సవం