చరిత్రలో ఈ రోజు….

చరిత్రలో ఈ రోజు..

*? జులై 30 ?*

గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 211వ రోజు (లీపు సంవత్సరములో 212వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 154 రోజులు మిగిలినవి.

*? సంఘటనలు ?*

762: బాగ్దాద్ నగరం స్థాపించబడింది.

1991: చారిత్రక స్టార్ట్ ఒప్పందంపై అమెరికా, రష్యా అధ్యక్షులు జార్జి బుష్, మిఖాయీల్ గోర్భచెవ్‌లు సంతకాలు చేశారు.

2013: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.

*?? జననాలు ??

1854: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (మ.1938)

1896: పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (మ.1996)

1922: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (మ.1993)

1931: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (మ.2007)

1939: గోపరాజు సమరం, వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు, రచయిత.

1945: దేవదాస్ కనకాల, నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (మ.2019)

*? మరణాలు ?*
2007: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (జ.1918)