చరిత్రలో ఈరోజు..

*చరిత్రలో ఈరోజు అక్టోబరు 15న..

జననాలు..

*1869:* రఘుపతి వెంకయ్య నాయుడు, కళాకారులు, చలనచిత్ర నిర్మాత. ఆయన మూకీ భారతీయ సినిమాలు మరియు టాకీలను నిర్మించారు.

*1874:* చంద్రధర్ బారువా, అస్సాంకు చెందిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత మరియు గీత రచయిత.

*1881:* పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (మ.1975)

*1889:* సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1944)

*1902:* భౌరావ్ గైక్వాడ్, మహారాష్ట్రకు చెందిన రాజకీయవేత్త మరియు సామాజిక కార్యకర్త.

*1908:* జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త. (జ.2006)

*1920:* మారియో పుజో, గాడ్‌ఫాదర్‌ నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన అద్భుత నవలా రచయిత. (మ. 1999)

*1920:* భూపతిరాజు విస్సం రాజు, రాసి సిమెంట్స్ మరియు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ మరియు భారతీయ సిమెంట్ పరిశ్రమకు మార్గదర్శకులలో ఒకరు, సంఘ సేవకులు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (మ.2002)

*1926:* మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (మ.1984)

*1927:* బుహారీ సయ్యద్ అబ్దుర్ రెహమాన్, తమిళ సీరియల్ వ్యవస్థాపకులు, పరోపకారి మరియు విద్యావేత్త.

*1927:* పర్దుమన్ సింగ్ బ్రార్, షాట్‌పుట్, డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడలలలో మనదేశానికి పతకాలు సాధించిన క్రీడాకారులు. (మ.2007)

*1931:* ఏ.పి.జే అబ్దుల్ కలాం భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, రాజకీయవేత్త, భారతదేశ అత్యుత్తమ పురస్కార భారతరత్న గ్రహీత. (మ.2015)

*1936:* మదన్ లాల్ ఖురానా, రాజకీయ నాయకులు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి.

*1949:* ప్రణయ్ రాయ్, పాత్రికేయులు, ఆర్థికవేత్త, చార్టర్డ్ అకౌంటెంట్.

*1953:* మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు.

*1957:* మీరా నాయర్, న్యూయార్క్ నగరంలో ఉన్న భారతీయ-అమెరికన్ చిత్రనిర్మాత.

*1964:* పేడాడ పరమేశ్వరరావు, రచయిత, భాషావేత్త, పాత్రికేయులు, విద్యావేత్త.

*1979’* అశ్వినీ అయ్యర్ తివారీ, చిత్రనిర్మాత మరియు రచయిత.

*1987:* సాయి ధరమ్ తేజ్, తెలుగు నటులు, “మెగాస్టార్” చిరంజీవికి మేనల్లుడు.

*1988:* రూప్ దుర్గాపాల్, టీవీ నటి.

*1989’* సచిన్ వారియర్, మలయాళ చలనచిత్ర నేపథ్య గాయకులు మరియు స్వరకర్త.

*1997:* దిగంగనా సూర్యవంశీ, చలనచిత్ర టీవీ నటి, గాయని మరియు రచయిత్రి.

? *మరణాలు* ?

*1937:* నెమిలి పట్టాభి రామారావు, స్వాతంత్ర్య సమరయోధులు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్‌. (జ.1862)

*1943:* బాబా కాన్షీరామ్, కవి, స్వాతంత్ర్య ఉద్యమకారులు.

*1961:* సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, కవి, నవలా రచయిత, వ్యాసకర్త మరియు కథా రచయిత.

*1982:* నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1903)

*1990:* ఓం శివపురి, థియేటర్ నటులు, దర్శకులు మరియు బాలీవుడ్ క్యారెక్టర్ నటులు.

*1992:* తల్విందర్ సింగ్ పర్మార్, సిక్కు తీవ్రవాది మరియు బబ్బర్ ఖల్సా సహ వ్యవస్థాపకులు.

*2014:* తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (జ.1936)

*2018:* పాల్ అలెన్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అమెరికన్ పెట్టుబడిదారు మరియు పరోపకారి. 65 సంవత్సరాల వయస్సులో మరణించారు.

*? సంఘటనలు ?*

*1582:* పోప్‌ గ్రెగరీ-13, గ్రెగరియన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అప్పటిదాకా అందరూ అనుసరిస్తున్న జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం అంతకు ముందురోజు అక్టోబరు 4. కొత్త గణన ప్రకారం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తర్వాత రోజును అక్టోబరు 15గా చేర్చి ప్రకటించింది. ఆ రకంగా మధ్యలో పదిరోజులను కావాలనే తప్పించడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న క్యాలెండర్‌ ఇదే.

*1928:* జర్మనీని విడిచిపెట్టిన నాలుగు రోజుల తర్వాత, గ్రాఫ్ జెప్పెలిన్(ఎయిర్ బెలూన్) న్యూజెర్సీలోని లేక్‌హర్స్ట్‌లో దిగి, దాని మొదటి అట్లాంటిక్ ట్రిప్‌ను పూర్తి చేసింది.

*1932:* దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా (‘టాటా సన్స్‌ లిమిటెడ్‌’) ప్రారంభమైంది.

*1934:* చైనీస్ కమ్యూనిస్టులు లాంగ్ మార్చ్, 6,000-మైలు (10,000-కిమీ) ట్రెక్‌ను ప్రారంభించారు, దీని ఫలితంగా కమ్యూనిస్ట్ విప్లవాత్మక స్థావరం ఆగ్నేయ చైనా నుండి వాయువ్య చైనాకు మార్చబడింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క తిరుగులేని నాయకులుగా మావో జెడాంగ్ కీర్తి పొందారు.

*1940:* కామెడీ క్లాసిక్ ది గ్రేట్ డిక్టేటర్ న్యూయార్క్ నగరంలో ప్రదర్శించబడింది. చార్లీ చాప్లిన్ యొక్క అతిపెద్ద బాక్స్-ఆఫీస్ విజయం, ఇది అడాల్ఫ్ హిట్లర్ మరియు నాజీయిజాన్ని వ్యంగ్యం చేసింది మరియు యూదు వ్యతిరేకతను ఖండించింది.

*1949:* బనారస్ సంస్థానం, త్రిపుర, మణిపూర్‌ భారత్‌లో విలీనమయ్యాయి.

*1959:* అంటార్కిటిక్ ఒప్పందంపై వాషింగ్టన్, డిసిలో చివరి సమావేశం జరిగింది. ఆరు వారాల చర్చల తర్వాత, ఈ ఒప్పందంపై 12 దేశాలు సంతకం చేశాయి, ఉచిత శాస్త్రీయ అధ్యయనం కోసం ఖండాన్ని సంరక్షించాయి.

*1969:* సోమాలియా అధ్యక్షులు కాబ్దిరాషీద్ కాలి షెర్మాఆర్కే (అబ్దిరాషిద్ అలీ షెర్మార్కే) ఇదేరోజున హత్యకు గురయ్యారు.

*1987:* బుర్కినా ఫాసోలో జరిగిన సైనిక తిరుగుబాటు దేశాధినేత థామస్ శంకరాను పదవీచ్యుతుడిని చేసి, అతనితో పాటు మరో ఎనిమిది మందిని చంపారు.

*1992:* ఎయిర్ ఇండియా విమానం: కనిష్క పేల్చివేతకు సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ ను భద్రతా దళాలు పంజాబులో కాల్చి చంపాయి.

*1993:* దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా మరియు ఎఫ్‌డబ్ల్యు డి క్లెర్క్, “వర్ణవివక్ష పాలనను శాంతియుతంగా రద్దు చేయడం కోసం మరియు కొత్త ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికాకు పునాదులు వేసినందుకు” నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలుగా పేర్కొనబడ్డారు.

*1997:* ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతి రాయ్కు బ్రిటన్‌ అత్యున్నత సాహితీ పురస్కారం ‘బుకర్స్‌ ప్రైజ్‌’ లభించింది.

*1997:* యుఎస్, అణుశక్తితో నడిచే కాస్సిని(ఉపగ్రహం)ని శనిపైకి ప్రయోగించింది.

*2003:* సిబ్బందితో కూడిన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించిన మూడవ దేశం చైనా. యాంగ్ లివీ చేత పైలట్ చేయబడిన షెంజో 5, 21 గంటల ప్రయాణంలో భూమి చుట్టూ 14 సార్లు ఇదేరోజున తిరిగింది.

*2009:* ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనే తెలుగు వార్తా ఛానెల్, ఇదేరోజున తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి ద్వారా ప్రారంభించబడింది. ఏబీఎన్ అంటే ఆమోద బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్.

*2018:* #MeToo కేసులో పలువురు మహిళలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన తర్వాత భారత మంత్రి మరియు సంపాదకుడు MJ అక్బర్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు.

? *పండుగలు, జాతీయ దినాలు* ?

*ప్రపంచ విద్యార్థుల దినోత్సవం: 2015లో ఐక్యరాజ్య సమితి అబ్దుల్‌ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశపు క్షిపణి శాస్త్రవేత్త, 11వ భారత రాష్ట్రపతి అయిన ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 2015, జులై 27న మరణించారు. ఆ సందర్భంగా ఐక్యరాజ్యసమితి అబ్దుల్ కలామ్ కు ఘన నివాళి అర్పించింది. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు కలాం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని నింపడానికి ప్రయత్నం చేశారనీ, భారత రాష్ట్రపతిగా ప్రపంచ శాంతి కోసం పరితపించారని ఐక్యరాజ్యసమితి కొనియాడుతూ అబ్దుల్‌ కలాం జయంతి రోజైన అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా నిర్ణయించింది. ఆయన పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో-ISRO)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ (missile man) గా పేరుగాంచారు. కలామ్ ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలామ్ తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో ఆయన రెండవ స్థానంలో ఎంపికైయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) షిల్లాంగ్‌లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, కలామ్ కుప్పకూలిపోయారు. 2015 జూలై 27న, 83 సంవత్సరాల వయసులో, గుండెపోటుతో మరణించారు. తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు, అక్కడ ఆయనను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు.*

*ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం: సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంకోసం ప్రతిరోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్న విషయం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అతిసార, శ్వాస కోస వంటి వ్యాధులతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పిల్లలు చనిపోతున్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే దీనికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో 2008లో ఐక్యరాజ్య సమితి అక్టోబరు 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యాలు, తల్లిదండ్రులు చిన్నారులకు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయించడం. చేతి శుభ్రతపై అవగాహన కల్పించి అంటురోగాలను అరికట్టడం, శుభ్రమైన చేతులే వ్యాధులను నివారించగలవని చెప్పడం. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్ ద్వారా చేతులు – పరిశుభ్రత కార్యక్రమం అమలు చేయడం. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా 2015లో మధ్యప్రదేశ్‌ గిన్నిస్‌ రికార్డులను నమోదు చేసింది. అక్టోబర్‌ 15న రాష్ట్రంలోనే 51 జిల్లాల నుంచి 12,76,425 మంది చిన్నారులు చేతులు కడిగే కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్‌ రికార్డు సాధించారు.*

*గర్భం మరియు శిశు నష్టాల జ్ఞాపక దినోత్సవం: అబార్షన్, ప్రసవం, ఎయిడ్స్, పిల్లల నష్టం, గర్భం మరియు వైద్య పరిస్థితులు, అనారోగ్యం, ప్రమాదాలు లేదా హింస కారణంగా జరిగే అన్ని రకాల శిశు మరణాలకు గౌరవం మరియు సంతాపాన్ని తెలియజేయడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న గర్భం మరియు శిశు నష్టం జ్ఞాపకార్థ దినం జరుపుకుంటారు. శిశువును కోల్పోవడం తల్లిదండ్రులకు గొప్ప బాధ. ఈ బాధను చర్చ నుండి వ్యక్తపరచలేము లేదా ఎవ్వరూ చూపించలేము. కానీ ఈ బాధను భరించే ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వడం కోసమే ఈ దినోత్సవం.*

*ప్రపంచ వైట్ కేన్ డే(అంధులకు మార్గనిర్దేశం): యునైటెడ్ స్టేట్స్‌లో జాతీయ ఆచారం ప్రకారం, దీనిని 1964 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. అంధత్వం లేదా దృష్టి లోపం ఉన్న వ్యక్తుల విజయాలు, అంధత్వానికి ముఖ్యమైన చిహ్నం మరియు స్వాతంత్ర్య సాధనం జరుపుకోవడానికి తేదీని కేటాయించారు. అక్టోబర్ 6, 1964న, యూఎస్ కాంగ్రెస్ యొక్క ఉమ్మడి తీర్మానంగా చట్టంగా సంతకం చేయబడింది. ఈ తీర్మానం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15ని “వైట్ కేన్ సేఫ్టీ డే”గా ప్రకటించడానికి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడికి అధికారం ఇచ్చింది. సంయుక్త తీర్మానం ఆమోదించిన కొన్ని గంటల్లోనే అధ్యక్షులు లిండన్ బి. జాన్సన్ మొదటి వైట్ కేన్ సేఫ్టీ డే ప్రకటనపై సంతకం చేశారు. 2011లో అధ్యక్షులు బరాక్ ఒబామా చేత వైట్ కేన్ సేఫ్టీ డేను బ్లైండ్ అమెరికన్స్ ఈక్వాలిటీ డేగా కూడా పేర్కొన్నారు.*