చరిత్రలో ఈరోజు…

? *చరిత్రలో ఈరోజు నవంబరు 4*?

*ఈరోజు వార్తలు*

*సంఘటనలు* :-

1869: నేచర్ (పత్రిక) అనేది ఒక బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది.

2004: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సుశీల్‌ కుమార్‌ షిండే నియమితుడయ్యాడు.

1947: భారతదేశపు మొట్టమొదటి పరమ వీరచక్ర పురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు.

1979: ఇరాన్ బందీల కల్లోలం మొదలైంది. ఇరాన్‌లోని అతివాదులు అమెరికా రాయబార కార్యాలయం మీద దాడి చేసి, 63 మంది అమెరికనులతో సహా 90 మందిని బందీలుగా పట్టుకున్నారు.

*జననాలు* :-

1845: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1883)

1889: జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1942)

1922: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (మ.1996)

1925: రిత్విక్ ఘటక్, ఒక బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత, స్క్రిప్టు రచయిత (మ.1976).

1929: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్ 203) (మ.2013).

1932: వి.బి.రాజేంద్రప్రసాద్, జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015)

1944: పద్మావతి బందోపాధ్యాయ, భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ.

*మరణాలు* :-

1980: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (జ.1923)

2007: అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (జ.1926)

*పండుగలు , జాతీయ దినాలు*:-

1956 : యమవిదియ