చరిత్రలో ఈరోజు..

చరిత్రలో ఈరోజు*

*🌅జూన్ 12🌄*

*🏞️సంఘటనలు🏞️*

1898: స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్‌కు విముక్తి, ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్య దినం.

1964: దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించబడింది.

1987: కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖయిల్ గోర్బచెవ్కు సవాల్ విసిరాడు.

1987: 13 సంవత్సరాల క్రూర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష విధించబడింది.

1996: భారత లోక్‌సభ స్పీకర్‌గా పి.ఎ.సంగ్మా పదవిని స్వీకరించాడు.

*🌻🌻జననాలు🌻🌻*

1902: పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (మ.1953)

1930: ఆచ్చి వేణుగోపాలాచార్యులు, సినీ గీత రచయిత. (మ.2016)

1935: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (మ.2016)

1975: తొట్టెంపూడి గోపీచంద్, తెలుగు నటుడు, తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు.

*🌹🌹మరణాలు🌹🌹*

1981: పి.బి. గజేంద్రగడ్కర్, భారతదేశ సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1901)

1999: జలగం వెంగళరావు, ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా పేరొందాడు. (జ.1921)

2002: చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (జ.1939)

2017: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1931)

*🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం