చరిత్ర లొ ఈరొజు..

చరిత్రలో ఈరోజు ఆగస్టు 15 న.

🌊 *సంఘటనలు* 🌊

*1938*: ఆంధ్రప్రభ దినపత్రిక చెన్నై (నాటి మద్రాసు) లో, పారిశ్రామిక వేత్త రామనాధ్ గోయెంకా మొదలు పెట్టాడు.

*1945*: కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశంగా ప్రకటించుకుంది.

*1947*: భారత దేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది.

*1947*: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటెన్ నియామకం.

*1960*: రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె), ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది.

*1971*: బహ్రెయిన్, బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.

*1972* : భారతదేశము లో పోస్టలు ఇండెక్సు నంబరు (PIN) అమలు లోకి వచ్చింది.

*1983*: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామ్ లాల్ నియమితులయ్యాడు.

🌕 *జననాలు* 🌕

*1769*: నెపోలియన్, ఫ్రెంచ్ చక్రవర్తి. (మ.1821)

*1872* : సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి అరవిందుడు జననం (మ.1950).

*1889*: దండు నారాయణరాజు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1944)

*1895*: వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1955)

*1913*: బాడిగ వెంకట నరసింహారావు, కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (మ.1994)

*1914*: పరశురామ ఘనాపాఠి వేదపండితుడు. (మ.2016)

*1924*: మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (మ.2011)

*1929*: ద్వివేదుల విశాలాక్షి, కథా, నవలా రచయిత్రి. (మ.2014)

*1931*: నాగభైరవ కోటేశ్వరరావు, కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (మ.2008)

*1935*: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (మ.2013)

*1949*: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (మ.1996)

*1949*: దేవిప్రియ, పాత్రికేయుడు, కవి (మ.2020).

*1955*: రాళ్ళపల్లి, తెలుగు సినిమా, రంగస్థల నటులు. (మ.2019)

*1961*: సుహాసిని, దక్షిణ భారత సినిమా నటి.

*1961*: పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు. (మ.2015)

*1964*: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు. (మ.2013)

*1975*: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ భరద్వాజ్

*1985*: లయ (నటి), తెలుగు సినిమా నటీమణి.

*1986*: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009)

💥 *మరణాలు* 💥

*1935*: అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆశుకవి, శతావధాని. (జ.1883)

*1942*: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (జ.1892)

*1949*: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866)

*2004*: అమర్‌సిన్హ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1941).

*2005*: బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (జ.1927)

*2006*: జి. వి. సుబ్రహ్మణ్యం, వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (జ.1935)

*2013*: లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.1956).

*2018*: అజిత్ వాడేకర్, భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1941)

🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴

*1947*: భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవం.

*1960*: రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె) స్వాతంత్ర్య దినోత్సవము.

*1971*: బహ్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం.