చరిత్రలో ఈరోజు.
*🌅అక్టోబర్ 21🌄*
*🏞సంఘటనలు🏞*
1934: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్ అధ్యక్షుడిగా ‘కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ’ ఆవిర్భావం.
1943: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు.
1954: పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సు నుండి భారత్కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది.
1990: దూరదర్శన్ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభం.
*🌻🌻జననాలు🌻🌻*
1833: ఆల్‍ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (మ.1896)
1881: రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (మ.1963)
1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.
1915: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక “ఆంధ్రప్రభ” నడిపించిన సంపాదకుడు
1920: తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు
1925: సూర్జీత్ సింగ్ బర్నాలా, ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2017)
1930: షమ్మీ కపూర్, భారత ప్రముఖ సినీనటుడు మరియు దర్శకుడు. (మ.2011)
1947: నోరి దత్తాత్రేయుడు, సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు మరియు రేడియేషన్ ఆంకాలజిస్టు, అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు.
*🌹🌹మరణాలు🌹🌹*
1985: పింగళి దశరధరామ్ హేతువాది, పత్రికా సంపాదకుడు.
1986: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923)
1996: పాకాల తిరుమల్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు. (జ.1915)
2002: హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు మరియు అనువాదకుడు. (జ.1920)
2005: మహీధర నళినీమోహన్, సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు.
*🔷జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు*🔷
🔻పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం.