చరిత్రలో ఈరోజు…

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅నవంబర్ 16🌄*

*🏞సంఘటనలు🏞*

1937: కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం.

1965: రష్యా ప్రయోగించిన వీనస్-3 అంతరిక్షనౌక శుక్రగ్రహం వైపు ప్రయాణం ప్రారంభించింది.

1966: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ రోజును భారత్‌లో జాతీయ పత్రికా దినంగా జరుపుకుంటారు.

*🌻🌻జననాలు🌻🌻*

1890: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త. (మ.1973)

1901: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (మ.1978)

1908 : తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్ .రెడ్డి )జననం (మ.1977).

1923: టి.ఎల్. కాంతారావు, ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. (మ.2009)

1930: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (మ.2013)

1931: వి.ఎల్.ఎస్.భీమశంకరం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు

1936: రామోజీరావు, భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు.

1963 : భారతీయ సినిమా నటి మీనాక్షి శేషాద్రి జననం.

1973: పుల్లెల గోపీచంద్, భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.

1973: ఆమని, తెలుగు, తమిళ సినిమా నటి

*🌹🌹మరణాలు🌹🌹*

1922 : ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహమ్ మరణం (జ.1875).

*🔷జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు*🔷

🔻జాతీయ పత్రికా దినోత్సవం