చరిత్రలో ఈరోజు..

*🌅జనవరి 17🌄*

*🏞సంఘటనలు🏞*

1989: మొదటిసారి ఒక భారతీయుడు – కల్నల్ జె.కె.బజాజ్ – దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.

1997 : ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ఇచ్చేది లేదని భారత ప్రభుత్వం ప్రకటించింది.

2008: టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.

*🌻🌻జననాలు🌻🌻*

1706: బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు (మ.1790)

1905 :ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ జననం (మ.1986).

1911: జార్జ్ స్టిగ్లర్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

1917: ఎం.జి.రామచంద్రన్‌, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)

1908: ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)

1942: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ క్రీడాకారుడు. (మ.2016)

1945: మడిపల్లి భద్రయ్య, తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.

1951 : భారతీయ సినిమా నటి బిందు జననం.

*🌹🌹మరణాలు🌹🌹*

2006: శాంతకుమారి, పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది. పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు, మంగళంపల్లి బాలమురళికృష్ణపాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు. (జ.1920)

2008: బాబీ ఫిషర్, చదరంగం క్రీడాకారుడు. (జ.1943)

2010: జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1914)

2016: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935)

*🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*

🔻ఎన్నికలు కమిషన్ స్థాపక దినోత్సవం.