చరిత్రలో ఈరోజు..

*🌅ఫిబ్రవరి 27🌄*

*🏞సంఘటనలు🏞*

1803: ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.

2002: అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.

*🌻🌻జననాలు🌻🌻*

1932 : ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ జననం (మ.2011).

1932: వేగె నాగేశ్వరరావు, సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.

1943: బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.

1972 : తెలుగు సినిమా నటుడు శివాజీ రాజా జననం.

*🌹🌹మరణాలు🌹🌹*

1712: మొదటి బహదూర్ షా భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)

1931: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)

1956: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888)

1985: ఆకురాతి చలమయ్య, ప్రముఖ తెలుగు రచయిత. హేతువాది, వీరి “రవీంద్ర భాస్కరం” రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.

2017: పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీమంత్రి. (జ.1929)

2005 : తెలుగు సినిమా సంగీత దర్శకుడు, సుదీర్ఘకాలం మహదేవన్ సహాయకుడిగా పనిచేసిన పుహళేంది మరణం