చరిత్రలో ఈరోజు.

చరిత్రలో ఈరోజు.

*🌅మార్చి 12🌄*

*🏞సంఘటనలు🏞*

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది

1993: ముంబైలో బాంబు పేలుళ్ళు

1912: జూలియట్ గార్డన్ లో గర్ల్ (బాలికల) స్కౌట్స్ ప్రారంభించారు.

1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా దామోదరం సంజీవయ్య పదవీ విరమణ (11 జనవరి 1960 నుంచి 12 మార్చి 1962 వరకు).

1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం (12 మార్చి 1962 నుంచి 29 ఫిబ్రవరి 1964 వరకు).

2007: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.

2011: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం

*🌻🌻జననాలు🌻🌻*

1913: యశ్వంతరావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి.

1947: ఆలపాటి వెంకట మోహనగుప్త, వ్యంగ్య చిత్రకారుడు.

1975: వి.అనామిక, ప్రముఖ భారతీయ సమకాలీన కళాకారిణి.

*🌹🌹మరణాలు🌹🌹*

1976: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1896)

2017: భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1964)

*🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*

🔻మారిషస్ గణతంత్ర దినోత్సవం