హుజూర్ నగర్ అభివృద్ధి కి ఆటంకాలు తొలిగాయి న్యాయం గెలిచింది. గేల్లీ అర్చన రవి

*హుజూర్నగర్ అభివృద్ధి కి ఆటంకాలు తొలిగాయి న్యాయం గెలిచింది* . *గేల్లీ అర్చన రవి…*

*ఆరు నెలల్లో హుజూర్ నగర్ మున్సిపాలిటీ అద్దంలా ఉండబోతుంది* ..*వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు* …

*సూర్యాపేట జిల్లా.*

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కొందరు కోర్టు స్టే లతో అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టించారని… వారికి తగిన బుద్ధి చెప్పేలా కోర్టు స్టే లు ఎత్తివేయడంతో..
హర్షం వ్యక్తం చేస్తూ కోర్టు తీర్పును స్వాగతిస్తూ మున్సిపల్ పాలకమండలి ఆధ్వర్యంలో టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు….. ఈ కార్యక్రమంలో భారీ గా పాల్గొన్న టిఆర్ఎస్ శ్రేణులు….

*మున్సిపల్ చైర్ పర్సన్ గేల్లీ అర్చన రవి మాట్లాడుతూ*

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారి గెలుపుతో సుమారుగా ఆరు కోట్ల రూపాయలను హుజూర్ నగర్ అభివృద్ధి కేటాయించడం, ఆ అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అని కొందరు, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించాలని సంకల్పంతో ఆ నిధులపై స్టే తీసుకురావడం జరిగింది…

ప్రస్తుతం స్టేట్ లు ఎత్తి వేయడంతో న్యాయం గెలిచింది, హుజూర్నగర్ అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతోంది అని అన్నారు…

*వైస్ చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ..*

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారి సహకారంతో సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి 23 కోట్లు నిధులను మంజూరు చేయగా… కొందరు వ్యక్తులు ఆ అభివృద్ధి ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుందో రాజకీయంగా తాము ఎక్కడ దూరం అవుతాము అనే ఆలోచనతో హుజూర్నగర్ అభివృద్ధి పదంలో నడవకుండా ఇబ్బంది కలిగించిందని చెప్పారు..

వారు తీసుకువచ్చిన స్టే అక్రమ అని తెలిసి, ఆ స్టేనీ కోర్ట్ తిరస్కరించడం జరిగిందని అన్నారు..

ఇప్పటికైనా స్టే లు వేస్తున్నా నాయకులకు కనువిప్పు కలిగి అభివృద్ధిలో పోటీపడలి అంతేకాని అభివృద్ధి అడ్డుకోవడంలో కాదని అన్నారు….