భారత రాష్ట్రపతిని కలిసిన సందీప్
భాగ IRS….
భారత 15 రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ని కలిసి హుజూర్నగర్ నివాసి అయిన సందీప్ భాగ IRS శుభాకాంక్షలు తెలియజేశారు..
హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని గిరిజన, బంజారా యొక్క ఆచార సంప్రదాయాలను, గతులను గురించి మాట్లాడుతూ ప్రకృతిలో భాగమై నివసించే అడవి బిడ్డలు అత్యంత స్వచ్ఛమైన మనుషులని మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతాను రాగాలకు స్వచ్ఛమైన కల్మషం లేని మానవీయ బంధాలకు గిరిజన బంజారా తెగలు ప్రతీకలుగా నిలుస్తారని అని తెలిపారు. గిరిజన బంజారాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, గిరిజన తండాల్లో విద్య వైద్యం తాగునీరు విద్యుత్తు తదితర మౌలిక వసతులు ఇంకా మెరుగుపడలసిన అవసరం ఉన్నదని వారికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఇమినైజేషన్ దినోత్సవం నవంబర్ 10 ని పురస్కరించుకొని నిన్న జాతుల ప్రజలకు మరింత ఇమ్యూనిటీ పెంచేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని కోరారు…