ఈనెల 8న ప్రభుత్వ విద్య సంస్థలకు సెలవు…

హైద‌రాబాద్:
తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది…
ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది.
అయితే దీనిని ఇప్పుడు సాధారణ సెలవుగా మార్చింది… షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు.
ఆ రోజు ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.
దీంతో ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను ఆ రోజు మూసి వేస్తారు..