ఉద్యోగం కోసం మాజీ మహిళ హోంగార్డు ఆమరణ దీక్ష.!.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మాజీ మహిళ హోంగార్డు మామిడి పద్మ గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

తొలగించిన తన హోంగార్డ్ ఉద్యోగం తనకు ఇప్పించా లని ప్రభుత్వానికి, ఉన్నత అధికారులకు గత కొన్ని రోజులుగా వివిధ రూపాలుగా నిరసనలు, ఆందోళనలతో పాటు ప్రభుత్వాన్ని వేడుకుంటు న్నారు.

తన కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి,అనారోగ్యం దృష్ట్యా కొద్దిరోజులుగా ఉద్యోగం రాలేకపోయానని నాపై దయ తలచి పోలీసు అధికారులు తనకు ఉద్యోగం ఇప్పించాలని పద్మ వేడుకుంటుంది….