80 ఏళ్లు పైబడిన వృద్ధులు,దివ్యాంగులకు హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది..!

*హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది..

తెలంగాణలో తొలిసారి వృద్ధులు, డిజేబుల్డ్ పర్సన్స్‌కు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.

80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల్లో ఇంటి వద్దనుంచి ఓటింగ్ చేసే అవకాశం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ వినియోగదారులకు సైతం.. ఈ సదవకాశాన్ని వినియోగించేందుకు ఇంకా ఒక్కరోజే ఉండటంతో.. ఈసీ తాజాగా మరోసారి అలెర్ట్ చేస్తూ, అర్హులైనవారు నమోదు చేసుకోవాలని కోరింది.