ఓ భార్య తన భర్తను తాళ్లతో కట్టేసి రోడ్డు పై..

మరో యువతితో తిరుగుతున్నాడంటూ ఓ భార్య తన భర్తను తాళ్లతో కట్టేసిన సంఘటన పరిగిలో చోటుచేసుకుంది. పరిగికి చెందిన రామ్ కుమార్ – రజిత భార్యాభర్తలు.తన భర్త రామ్ కుమార్ కొంతకాలంగా మరో అమ్మాయితో అక్రమ సంబంధం నడుపుతుందని భార్య గుర్తించింది. భర్త రామ్ కుమార్ శుక్రవారం రాత్రి పరిగి విద్యారణ్య పురిలోని ఉన్నట్లు భార్య రజిత సమాచారం తెలుసుకుంది. రజిత తన అన్నదమ్ముళ్లతో కలిసి భర్త రామ్ కుమార్ మరో మహిళతో తుంకుల గడ్డ వద్ద ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు భర్త రామ్ కుమార్ ను, భార్య రజిత, మరో మహిళను ఉదయం పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పి వెళ్లిపోయారు. రజిత భర్త రామ్ కుమార్ శనివారం ఉదయం అక్రమ సంబంధం నడుపుతున్నాడన్న అమ్మాయితో బైక్ పై పారిపోతుండగా భార్య రజిత ఆమె సోదరులు పట్టుకున్నారు. మళ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరింది. తనకున్న పొలాన్ని అమ్మి జల్సా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని భార్య రజిత ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకు, తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బోరున విలపించింది. రెండు సంవత్సరాల కిందట మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్లిన విషయంలో ఫోక్సో కింద కేసు నడుస్తుందని మళ్లీ ఇప్పుడు వేరే అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడని తగిన బుద్ది చెప్పాలని కోరింది. పోలీసులు భర్త రామ్ కుమార్ కు కౌన్సిలింగ్ నిర్వహించారు..