లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి…

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి…

నవంబర్ నెల 12వ తేదీన జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు జిట్టా శ్యాం కుమార్, సాకేత్ మిత్ర లు కోరారు. బుధవారం న్యాయస్థాన ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహణ గురించి ఏర్పాటుచేసిన న్యాయవాదుల సమావేశంలో వారు మాట్లాడారు. రోజురోజుకీ దేశవ్యాప్తంగా అనూహ్యంగా పెరిగిపోతున్న కేసుల పెండింగ్ భారాన్ని తగ్గించడానికి లోక్ అదాలత్ ఒక్కటే ఏకైక మార్గమన్నారు లోకదాలత్ ను నిర్వహించడానికి న్యాయవాదుల సహకారం ఎంతో అవసరమని న్యాయవాదుల సహకారం లేకుండా విజయవంతం చేయడం సాధ్యం కాదని అందువల్ల లోక్ అదాలత్ విజయవంతం కొరకు న్యాయవాదులు కోర్టుకు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, బ్యాంకు దావాలు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాల కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, బాగ పంపిణీల కేసులు, తదితర అన్ని కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించనున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, ప్రభుత్వ న్యాయవాది ఉప్పల గోపాలకృష్ణమూర్తి, రమణారెడ్డి, వట్టికూటి అంజయ్య, ఎం. ఎస్. రాఘవరావు, కొట్టు సురేష్, చల్లా కృష్ణయ్య, మామిడి వెంకయ్య, బానోతు శ్రీను, జుట్టుకొండ సత్యనారాయణ, కుక్కడపు నరసింహారావు, సైదా హుస్సేన్, లతీఫ్, జక్కుల వీరయ్య, చక్రాల వెంకటేశ్వర్లు, నరేష్, వీరయ్య, సురేష్ నాయక్, శంకర్ నాయక్, పాలేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.