హుజూర్ నగర్ లో మినీ స్టేడియానికి కోటి రూపాయలు విడుదల… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

*సూర్యాపేట జిల్లా…..*

హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఐటిఐ కాలేజ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి… పాల్గొన్నా నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి… కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్…..

*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..*….

హుజూర్ నగర్ పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణ హుజూర్నగర్ మిని స్టేడియం నికి కోటి రూపాయలు విడుదల….

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయింది ఉద్యోగాల కోసం…….

ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ఏర్పాటుతోపాటు టాటా టెక్నాలజీ సహకారంతో ట్రైనింగ్ ఏర్పాటుతోపాటు కూడా చేయడం జరుగుతుందని అన్నారు…

కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆరు నెలల్లోనే 30000 ఉద్యోగాల నియామక పత్రాన్ని నిరుద్యోగులకు అందించడం జరిగింది..

గత ప్రభుత్వ నిరుద్యోగులని విస్మరించింది..

ఐటిఐ కాలేజీ ఏర్పాటు వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్కిల్స్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతాయి..

32 కోర్సులలో విద్యార్థులకు కోచింగ్ అందించడంతోపాటు.. వారంలో ఒకరోజు కంపెనీస్ ద్వారా ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేసి వెంటనే నియమక పత్రాన్ని కూడా అందించడం జరుగుతుంది..

ఐటిఐ లో ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు 11వేల రూపాయల స్టయిఫండ్ ఇవ్వటం కూడా జరుగుతుంది..

అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విద్యార్థులకు అవగాహన కల్పించడం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది… స్థానికంగా ఉద్యోగాలు కావాలని తన వద్దకు వచ్చి కొందరు అడుగుతున్నప్పుడల్లా ఎంతో బాధ వేస్తుందని ఎలాగైనా వారందరికీ న్యాయం జరగాలంటే ఇండస్ట్రీలో అవసరం ఉన్న సబ్జెక్టుని విద్యార్థులు నేర్చుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఐటిఐ కాలేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు..

నిరుద్యోగులు ఇంత గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని అద్భుతమైన ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని తెలిపారు..

10 సంవత్సరాల పాటు మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు డెబ్బై శాతం పూర్తయిన 2160 పిల్లని సందర్శించి పోవడమే తప్ప కనీసం వాటిని పూర్తి చేసి ప్రజలకి పంచాలని ఆలోచన కూడా రాలేదన్నారు…

హుజూర్నగర్ లో ప్రతి నిరుపేదకి ఖచ్చితంగా మోడల్ కాలనీలో ఇల్లు అందేలా పారదర్శకంగా నిజమైన నిర్వాసితులకే అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వివరించడం జరిగిందని అన్నారు..

తన హయాంలోనే రింగ్రోడ్డు శంకుస్థాపన జరిగిందని ప్రస్తుతం తన హయాంలోనే పూర్తి చేయడం కూడా జరుగుతుందని అన్నారు..

హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటుకు దాదాపు అన్ని పూర్తయ్యాయని తెలిపారు..

ఆర్ ఎం బి రోడ్లు పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండటం కోసం కొంత నిధులు వెచ్చించి రోడ్లన్నీ ఆధునీకరణ చేస్తున్నట్టు వివరించారు..

*ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ*

నిరుద్యోగులు గొప్ప అవకాశం ఉత్తంకుమార్ రెడ్డి గారి కల్పించారని ప్రతి ఒక్క నిరుద్యోగు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో గొప్ప ఉద్యోగాలు సంపాదించాలని అన్నారు..

త్వరలో ఐదు లక్షల మెజార్టీతో రాష్ట్రంలో అగ్రగామిగా నిలపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు… ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు.. అన్ని నియోజకవర్గాల కంటే హుజూర్నగర్ లో ఎక్కువ రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు…