*సెప్టెంబరు10.11తేదీలలో.
*హుజూర్‌నగర్ లో ముత్యాలమ్మ జాతర……
సెప్టెంబరు 14 న కనకదుర్గ అమ్మవారి జాతర..
ముత్యాలమ్మ జాతర నిర్వహణ, మరియు.నిర్మాణ కమిటీ తెలిపినా వివరాల ప్రకారం… హైదరాబాదులో బోనాల ఉత్సవాల తరవాత ఆ స్థాయిలో అత్యంత వైభవంగా నడిచే హుజూర్నగర్ పోచమ్మ తల్లి జాతరకి ఎక్కడెక్కడ ఉండే దూర ప్రాంతాల నుండి బంధువులు కూడా వస్తూ ఉంటారు.. ఈ పండగ ఎప్పుడొస్తుందా అంటూ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి అంగరంగ వైభవంగా నడిచే ఈ జాతర ఎప్పుడు అనేది ఆలయ కమిటీ నిర్ణయించింది…
హుజూర్ నగర్ పట్టణంలో ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ముత్యాలమ్మ జాతర ఈనెల 10(ఆదివారం), 11(సోమవారం) తేదీల్లో జరపాలని సోమవారం ముత్యాలమ్మ జాతర కమిటీ నిర్ణయించింది. ఈనెల 7(గురువారం) పట్టణంలో సల్లకుండ ఎత్తే కార్యక్రమం ద్వారా జాతర ప్రారంభమై.. 10 ఆదివారం పెద్ద ముత్యాలమ్మ తల్లికి.. 11 సోమవారం చిన్న ముత్యాలమ్మ తల్లికి.. 14న గురువారం కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.పట్టణ ప్రజలందరూ ముత్యాలమ్మ జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని కార్యక్రమంలో ముత్యాలమ్మ జాతర ఉత్సవ కమిటీ సభ్యులు, కుల పెద్దలు పాల్గొన్నారు..