హుజూరాబాద్‌కు 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలు ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ వెల్లడి..

హుజూరాబాద్‌కు 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలు ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ వెల్లడి..


R9TELUGUNEWS.COM.
హుజురాబాద్ ఉప ఎన్నికలు హోరాహోరీగా ప్రచారం నడుస్తున్న వేళ ముఖ్యంగా పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యనే ఉంటుంది.. అధికార టీఆర్ఎస్ బిజెపి ఈటల మధ్య పోరు ఉండబోతుంది… ఈ తరుణంలో లో ఇరు పార్టీలకు ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది… ఎలాగైనా ఈ సీటును గెలుచుకొని ఈటెల ఆధిపత్యానికి.. టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత లేదు అని నిరూపించుకునే పనిలో టిఆర్ఎస్ పార్టీ ఉండగా.. బిజెపి పార్టీ మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని ప్రజల్లోకి వెళ్లాలి అంటే కచ్చితంగా ఈటల గెలవాల్సిందే అనే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు… ఇదంతా ఇలా ఉండగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంలో ఈ సి ఉన్నది..హుజూరాబాద్‌ ఉపఎన్నికలో భద్రతకు 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ తెలిపారు. వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికే నియోజకవర్గానికి చేరుకున్నాయన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కరోనా నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాలని, మద్యం, నగదు పంపిణీపై నిఘా మరింత పెంచాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై కరీంనగర్‌, హనుమకొండ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో శనివారం ఆయన ఇక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర బలగాల సేవలపై సీఆర్పీఎఫ్‌ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా సమన్వయాధికారిగా వ్యవహరిస్తారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు స్పష్టంచేశాం. కరోనా పరిస్థితులు, పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాలపై వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశాం. నిబంధనల అమలులో ఎక్కడైనా అలసత్వం వహించినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని శశాంక్‌ గోయల్‌ వివరించారు.