ముగిసిన హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం..

*ముగిసిన హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం*

మూగబోయిన మైకులు..
అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి ముగింపు పలికారు.

హోరాహోరీగా సాగినా ప్రధాన పార్టీల ప్రచారం..

32 మంది అభ్యర్థులు..

రెండు ఈవీఎంలు

ఒక దాంట్లో 16 ..మరో దాంట్లో 16 మంది అభ్యర్థులు

ఈనెల 30న హుజురాబాద్ పోలింగ్..

నవంబర్ 2న ఫలితాలు….
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,36,283 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,18,720 ఓటర్లున్నారు. 1,17,563 మంది మహిళ ఓటర్లున్నారని ఈసీ ప్రకటించింది.305 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది.

నియోజకవర్గ ఉప ఎన్నికల్లో 30 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్ధులు మినహా మిగిలినవారంతా ఇండిపెండెంట్లు. బిజెపి అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేంద్ర, తెరాస అభ్యర్ధిగా Gellu Srinivas Yadav, కాంగ్రెస్ అభ్యర్ధిగా Balmuri Venkat బరిలో నిలిచారు. మిగిలిన వారంతా స్వతంత్రులే అభ్యర్థులే..

ఈ ఉప ఎన్నిక ప్రచారాన్ని బీజేపీ, టీఆర్ఎస్‌లు నాలుగు మాసాల క్రితమే ప్రారంభించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత అభ్యర్ధిని ప్రకటించింది. ఆలస్యంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది.ఈ అసెంబ్లీ స్థానం నుండి 2009 నుండి ఈటల రాజేందర్ వరుసగా టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే ఇటీవల చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ ఈ ఏడాది జూన్ 14న బీజేపీలో చేరారు. అంతకు రెండు రోజుల ముందే ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు బాధ్యతను హరీష్ రావు తన భుజాన వేసుకొన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా తన ఒక్కప్పటి సహచరుడు ఈటల రాజేందర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా పెట్రోల్, డీజీల్,వంట గ్యాస్ ధరల పెంపు అంశాన్ని ప్రధానంగా హరీష్ రావు తెరపైకి తెచ్చారు…

హుజురాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నెల 28న హుజురాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసిననాటి నుంచి నేటి వరకు కరీంనగర్ కమిషనరేట్, వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 ఏంసీసీ, 10 వీఎస్‌టీ లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో భాగంగా, ఇప్పటివరకు వేర్వేరు సందర్భాలలో రూ. 3,29,36,830 నగదును పట్టుకున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు రూ. 6,36,052 విలువగల 944 లీటర్ల మద్యం, రూ. 69,750 రూపాయల విలువగల 11.4 కేజి లు గంజాయి, రూ.44,040 రూపాయలు విలువగల పేలుడు పదార్థాలను, రూ. 2,21,000 విలువగల చీరలు, చొక్కాలను, రూ. 10,60,000 రూపాయలు విలువగల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు…