హుజురాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే ఎగిరింది. ..బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు..

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌లో భాజపా ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాల్లో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఆయనని భుజాల మీద ఎత్తుకుని కార్యకర్తలు సందడి చేశారు. పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు…..
ఎగిరేది కాషాయ జెండానే ఎగిరింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు…..
సంబరాల్లో పాల్గొన్నారు..అనంతరం.బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..
హుజురాబాద్‌ బై ఎలక్షన్ కౌంటింగ్‌లో రౌండు రౌండుకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మెజారిటీ పెరగటంతో గెలుపు ఖాయం అయ్యింది…
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ భారీ విజయం సాధించడం ఖాయమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం నిశ్చయమని అన్నారు. ‘‘ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడు. ఈటల గెలుపు బీజేపీ గెలుపు.. బీజేపీ గెలుపు ఈటల గెలుపే” అని బండి సంజయ్ చెప్పారు. సీఎం కేసీఆర్‌‌పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం కోల్పోయారు….