హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లలో ప్రచారానికి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా రాక.!

ఈనెల 30 వ తేదీన హుజూరాబాద్ లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ ఉప ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్ర‌చారం చేస్తున్న‌ది. హ‌రీష్‌రావు అన్నీ తానై ప్ర‌చారం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే కేసీఆర్ భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉన్న‌ది. అయితే, ఇటు బీజేపీ కూడా పోటీ పోటీగా ప్ర‌చారం చేస్తున్న‌ది. బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ బరిలో ఉన్నారు. ప్ర‌స్తుతానికి లోక‌ల్‌లో బీజేపీ నాయ‌కులు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. పండుగ త‌రువాత తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి త‌దిత‌రులు ప్ర‌చారం చేయ‌బోతున్నారు. అదే విధంగా ఈ ఎన్నిక‌ల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా త‌దిత‌రులు కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారం చేసేందుకు వ‌స్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ ను ఎలాగైనా గెలుచుకోవాల‌ని బీజేపీ చూస్తున్న‌ది. హుజురాబాద్‌లో వెయ్యి మందికి మించి స‌భ‌కు హాజ‌రుకాకుండా చూడాల‌ని ఈసీ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్‌కు వెలుప‌ల స‌భ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్‌లు ప్లాన్ చేస్తున్నాయి.