కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు..

భిన్నాభిప్రాయాలు సహజమే కానీ.. అవి చాలా దూరం వెళ్లి తెగేవరకు లాగేలా పంచాయితీ కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు సీనియర్లు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితమే వాళ్లకు అస్త్రంగా మారింది. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు ఓపెన్‌ కాగా.. పరోక్షంగా మరో సీనియర్‌ నాయకుడు వ్యవహారాలను చక్కబెట్టే పనిలో ఉన్నారట. అయితే రేవంత్‌ను కాసేపు పక్కన పెట్టి.. రాష్ట్ర ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌పై టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది….

ఢిల్లీకి పిలుపు…!.?

హుజూరాబాద్ ఓటమిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇప్పటికే విచారణ కోసం ఓ ప్రత్యేక కమిటీ వేసింది అధిష్టానం. అక్కడితో ఆగకుండా.. పీసీసీ నేతల నుండి వివరణ కోరాలని డిసైడైంది. రేపు పీసీసీ నేతలతోపాటు.. పోటీచేసిన అభ్యర్ధి బల్మూరి వెంకట్ ను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. దీంతో హస్తం పార్టీ నేతల్లో కొద్దిగా ఆందోళన మొదలైంది…
ఢిల్లీ పెద్దలను కూడా పరేషాన్ చేసింది. దీంతో రేపు ఢిల్లీకి రావాలని పీసీసీ నేతలకు కబురు పెట్టినట్లు టాక్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసిన బల్మూరి వెంకట్ తోపాటు.. ఎన్నిక బాధ్యతలు తీసుకున్న పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ తోపాటు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యే సీతక్కతోపాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో వున్న మరికొందరు నేతలకు ఢిల్లీ రావాలని కబురొచ్చింది…

డిపాజిట్ కూడా రాకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం.

హుజూరాబాద్ అభ్యర్ధి ఎంపిక నుండి.. ప్రచారం, ఓటమికి గల కారణాలపై విచారించనుంది హైకమాండ్. కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో సాంప్రదాయ ఓటు బ్యాంక్ వుంటుంది. అలాంటిది డిపాజిట్ గల్లంతై.. 3వేల ఓట్లు రావడం ఏంటని హస్తం పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. దానిపై వివరణ తీసుకునేందుకు హైకమాండ్ పీసీసీ నేతలను ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం. అయితే అధిష్టానం వద్ద ఎలా వివరణ ఇవ్వాలో తెలియక పీసీసీ నేతలు తల పట్టుకుంటున్నారు…..

కాంగ్రెస్‌లో రహస్య సమావేశాలు..!

ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన సమావేశం తర్వాత.. పార్టీలో ఇద్దరు కీలక నాయకులు రహస్యంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌తో సంబంధం లేకుండా మరో ఇద్దరు నేతలు సైతం ప్రత్యేకంగా సమావేశమైనట్టు టాక్‌. ఈ సమావేశాల వేడి సెగలు రేపుతున్న సమయంలోనే జూబ్లీహిల్స్‌లో సీనియర్ నాయకులు భేటీ అయ్యారట. ఆ మీటింగ్‌లోనే ఠాగూర్‌ని రాష్ట్ర ఇంఛార్జ్‌ పదవి నుంచి తప్పించే స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఈ తరహా రహస్య సమావేశాలు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్‌లో ఎక్కువైయ్యాయి. గడిచిన వారం రోజులుగా కాంగ్రెస్‌ రాజకీయం అంతా రహాస్యం చుట్టూనే తిరుగుతోంది…

అసలే టార్గెట్ టీపీసీసీ రేవంత్ కి సహకరిస్తున్న ఠాగూర్..!?

ఠాగూర్‌ని రాష్ట్ర ఇంఛార్జ్‌ పదవి నుంచి తప్పించాలని… ఈనెల 13న ఢిల్లీ వెళ్లనున్నట్లు పలువురు సీనియర్లు అభిప్రాయం… ఠాగూర్ ని ఇంఛార్జ్‌ పదవి నుంచి తొలగిస్తే పార్టీ బ్రతికి బట్ట కట్టే అవకాశం ఉంటుంది లేకపోతె పార్టీకి ఇంకా గడ్డుకాలం ఎదురవుతుంది అని అధిష్టానానికి తేల్చి చెప్పడం ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.. రేవంత్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ ఓటమిలో వారికి కూడా బాధ్యత ఉన్నట్లుగా అధిష్టానానికి తలపడనున్నారు..