హుజూర్ నగర్ లో రోడ్డున పడ్డ 108 కార్యాలయం సిబ్బంది..! కార్యాలయం లేక ఇక్కట్లు..

**సూర్యాపేట జిల్లా* ..

హుజూర్ నగర్ లో రోడ్డున పడ్డ 108 కార్యాలయం సిబ్బంది….

కార్యాలయం లేక ఇక్కట్లు..

కనీసం ఫోన్ కాల్స్ చూడటానికి కూడ ట్యాబ్ లో చార్జింగ్ లేని వైనం…

పాత కార్యాలయం కుల కొట్టడంతో ,, రోడ్డున పడ్డ సిబ్బంది…

చెట్ల కిందే విధులు…

చెట్ల కిందే డాక్యుమెంట్స్ బీరువాలు..

హుజూర్ నగర్ పట్టణంలో
ఎంపీడీవో ఆఫీస్ లో ఉన్న 108, 102 వసతి భవనం కూల్చివేత..
ప్రతినత్యం ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలు కాపాడే 108, 102 సిబ్బంది రోడ్డుమీద పడ్డారు. ప్రస్తుతం నిలువ నీడ లేక చెట్టునీడలోనే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న పరిస్థితి హుజూర్నగర్ మండల కేంద్రంలో నెలకొంది. మండల పరిషత్ ఆవరణలో నాణ్యతతో ఉన్న భవనాలను రాత్రికి రాత్రే ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడంతో 108 సిబ్బంది తమ సామాన్లను బయట పెట్టుకొని రోడ్డుమీదనే ఉండవలిసిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కఫోన్ కాల్ వస్తే తమ విధులు పట్ల అప్రమత్తంగా ఉండే సిబ్బంది చెట్టు నీడలో సేద తీరుతున్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోనే సబ్ ట్రెజరీ..

మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఒక కార్యాలయంలో గత కొంతకాలంగా సబ్ ట్రెజర సిబ్బంది. 108,102 సిబ్బంది తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మరో భవనం ఎంతో కాలంగా నిరుపయోగంగా ఉంది. ఒక్కసారిగా రాత్రికి రాత్రి భవనపాలను కూల్చి వేయడంతో సిబ్బంది తమ సామాగ్రినిబయట పెటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్రెడ్డి 2005వ సంవత్సరంలో 108 కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయం నుండి నిర్వహించాలని వారి కోసం ఒక గది కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నేపథ్యంలో అనాటి నుంచి 108 సిబ్బంది తమ కార్యాకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ కార్యలయం నుండి నిర్వహిస్తున్నారు. కానీ హుజూర్నగర్ మండల పరిషత్ కార్యలయంలు ఉన్న నాణ్యమైన భవనాలను కూల్చి వేయడంతో వారు రోడ్డున పడ్డారు. ప్రమాదంతో గాయపడిన వారికి 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారిని 102 ద్వారా వారి ఇంటి వద్ద దింపడానికి ఏర్పాటు చేశారు. సుమారు 6 మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారు రెండు రోజులుగా చెట్టు నీడలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం వెంటనే మండల పరిషత్ కార్యాలయంలో వారికి కార్యాలయం కేటాయించాలని
కోరుతున్నారు. కలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు.

బవనాల కూల్చివేతకు అధికారుల అనుమతులు ఉన్నాయా..

మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న రెండు భవనాలను కూల్చివేతకు పై అధికారుల అనుమతులు ఉన్నయా. లేవా అనే సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో కూల్చి వేయడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయా కార్యాలయాల్లో విలువైన సామాగ్రి ఉన్నట్లు సమాచారం. టేకు దర్వాజలు, తులపులు, కిటికీలు, దూలాలు ఉన్నాయి. కొంత సామాగ్రి పక్కదోవ పట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నాణ్యమైన భవనాలు కూల్చివేయాలయంటే పై అధికారుల అనుమతి తప్పనిసరి. దానికి కారణాలు కూడా చూపించవలిసి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు లేక ఇబ్బందులు పడుతుంటే లక్షల రూపాయల విలువ చేసే భవనాలు కూల్చి వేయడం ఎంతవరకు సబబు. జిల్లాస్థాయి అధికారులకే తెలియాలి. వాటిని ఇతర ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే పట్టణంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు లక్షల రూపాయలు కిరాయిలు వెచ్చించి ప్రైవేట్ భవనాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వేరే నిర్మాణంలు
చేపట్టాలనుకుంటే తగినంత స్థలం ఉంది. లక్షలు విలువైన ప్రభుత్వ ఆస్థిని కూల్చడం

పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుంది.

కార్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలి..

108 మెడికల్ టెక్నిషియన్ గండు అశోక్, మాట్లడుతూ

తమకు ఏలాంటి సమాచారం లేకుండా రాత్రి సమయంలో భవనం కూల్చి వేయడంతో రోడ్డున పడ్డాం. కాలకృత్యాలు కూడా తీర్చుకోఏని పరిస్థితి ఏర్పడింది. నీరు కూడా లభించడం లేదు. తమకు వెంటనే కార్యాలయం ఏర్పాటు చేయాలని కోతున్నాం. నిత్యం హడావుడిగా ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి తాము ఎంతగానో కృషి చేశామని కానీ ఈరోజు ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. 20 రోజులుగా తమకి ఓ కార్యాలయాన్ని చూపించమని అడిగితే కనీసం కూడా స్పందించలేదని అన్నారు..

అనుమతులతో కూల్చి వేశారు..ఎంపీడీఓ లావణ్య,

ఉన్నాతాధికారుల అనుమతితో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న భవనాలను కూల్చివేస్తున్నాం. ఆదే విధంగా విలువైన సామాగ్రినికాంట్రాక్టర్కు అప్పగిస్తున్నాం. నిధులను ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తున్నాం. ఎంపీడీఓ లావణ్య, హుజూర్నగర్..