రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క పౌరుడు గౌరవించాలి- సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్ కుమార్.

R9TELUGUNEWS.COM
రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం మరియు న్యాయవాద దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజుర్నగర్ జిల్లా అదనపు కోర్టు ప్రాంగణంలో హుజూర్నగర్ కోర్ట్ SCJ మరియు JCJ న్యాయమూర్తుల సమక్షంలో న్యాయవాదులు మరియు కోర్ట్ సిబ్బంది ఆవిర్భావ దినోత్సవం మరియు లాడే ను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మండల లీగల్ సెల్ వారు నిర్వహించిన సమావేశంలో *హుజూర్నగర్ సీనియర్ సివిల్ జట్ట శ్యామ్ కుమార్ గారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలి అని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేస్తాయని భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వారు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు కనుగుణంగా న్యాయస్థానాలను ఆశ్రయించి వారి హక్కులను వారు కాపాడుకుంటారని రాజ్యాంగం అనేది సామాన్యుడు పాలిట వజ్రాయుధమని పేర్కొన్నారు*
*తదుపరి మరో ముఖ్య అతిది జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ గారు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం రాజ్యాంగ ఆవశ్యకత మరియు స్వాతంత్రం తరువాత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను న్యాయవాదులకు మరియు కక్షిదారులకు వివరించడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగం అనేది తాడిత పీడిత పరాజిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని పౌర హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు పౌరుడు రాజ్యాంగం వైపు చూస్తారని రాజ్యాంగం అనేది సామాన్య ప్రజలకు రక్షణ కవచంలా పనిచేస్తుందని అందుకని సమాజంలోని ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని రాజ్యాంగం పట్ల గౌరవ విధేయతను చూపాల్సిందిగా ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు*
ఈ సమావేశంలో న్యాయమూర్తులు ప్రవేశికలో పొందుపరిచిన విషయాలను న్యాయవాదులు మరియు కక్షిదారులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది…
ఈ సమావేశం హుజూర్నగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జక్కుల వీరయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏజిపి నట్టే సత్యనారాయణ,న్యాయవాదులు అంబటి శ్రీనివాస్ రెడ్డి, గోపాలకృష్ణమూర్తి, చన్నగాని యాదగిరి, కుక్కడుపు నరసింహ రావు, జుట్టుకొండ సత్యనారాయణ,నగేష్ రాథోడ్, కాకునూరి ప్రదీప్తి, లతీఫ్, రమణారెడ్డి,రేణుక,దీపికా, సంధ్య,వట్టికూటి అంజయ్య ,చక్రాల వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి,కొట్టు సురేష్, పాలేటి శ్రీనివాస్, నాగార్జున,శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్ సైదా హుస్సేన్, రామలక్ష్మ రెడ్డి, వీరు,మీసాల అంజయ్య,నరేష్, నాగూర్ భాష,మోహన్, రమేష్*,అదేవిదంగా ఇతర బార్ న్యాయ వాదులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామీ వార్షికోత్సవం

R9TELUGUNEWS.COM
శ్రీ వరసిద్ధి వినాయక స్వామీ వార్షికోత్సవం
హుజూర్ నగర్ (పోంచర్ల ) లో దాతల సహకారంతో నిర్మించుకున్న, తొలి పూజలు అందుకుని విఘ్నాలు తొలగించే *శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. 14 వ వార్షికోత్సవం* పురస్కరించుకొని,ది.26-11- 24 మంగళవారం రోజున మూలవిరాట్ స్వామికి *గోక్షీరం* (ఆవుపాలు) చే ఉదయం 6-00 గంటల నుండి 7-00 గంటల వరకు అభిషేకములు .తదుపరి *అలంకరణ, గణపతి పూజ, మంత్రపుష్పనీరాజనం,తీర్థ ప్రసాద వినియోగము,*స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయినారు ఇట్టి కార్యక్రమంలో పశ్య శ్రీనివాసరెడ్డి, గుండా రమేష్ , తండు సైదారత్నం , ఓరుగంటి నాగేశ్వరరావు , మాశెట్టి అనంత రాములు , జేష్ఠవేణి సత్యం , వెంకటనారాయణ , msn రాజు , పారేపల్లి సత్యనారాయణ , యర్రంశెట్టి పిచ్చయ్య , కొమ్ము శ్రీనివాస్ భక్తులు మహిళలు అధికసంఖ్య లో పాల్గొన్నారు
చింతలపాలెం లొ సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని ఇంటింటి ప్రచారం..!
.
R9TELUGUNEWS.COM
చింతలపాలెం మండల కేంద్రంలో ఈనెల 29న సూర్యాపేటలో సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులువట్టేపు సైదులు. మండల కార్యదర్శి కందుల సుందర్మలేశ్వర్ రెడ్డి శాఖ కార్యదర్శి SK అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు…
ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను సవరించాలని ఐ ఎన్ టీ యూ సి ధర్నా…
– విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి
– ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
– ఐ ఎన్ టి యు సి జిల్లా కార్యదర్శి చింతకాయల రాము.
.
R9TELUGUNEWS.COM
హుజూర్ నగర్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రo లో ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యారగాని నాగన్న గౌడ్ ఆదేశాల మేరకు ఐ ఎన్ టీ యూ సి సూర్యాపేట జిల్లా కార్యదర్శి చింతకాయల రాము ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశంలోని అత్యధిక ధనవంతుల ఆదాయంపై సంపద టాక్స్ ను పెంచి, విద్యా, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు కేటాయించాలన్నారు. అడ్డగోలుగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను,విద్యుత్ సవరణ బిల్లు- 2022ను రద్దు చేయాలన్నారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను సవరించి పెరుగుతున్న నిత్యవసరాల వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిలుపుదల చేయాలని, సింగరేణి కి నేరుగా గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనంగా రూ 26 వేలను, రూ. 10 వేల రూపాయల పెన్షన్ ను అందించాలన్నారు. కాంట్రాక్టు విధానం రద్దుచేసి, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి,ఐ ఎన్ టి యు సి సీనియర్ నాయకులు యరగాని గురవయ్య గౌడ్, మేకల నాగేశ్వర రావు, ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి, మలిదశ ఉద్యమకారుడు యడ్ల విజయ్,మద్దo నాగేందర్, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కందుల వెంకటేశ్వర్లు,బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు భూపతి శ్రీను, హౌస్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగేందర్, ఐతగాని వీరస్వామి తదితరులు పాల్గొన్నారు…
*నేరేడుచర్ల ఎస్సీ హాస్టల్ తనిఖీ..

R9TELUGUNEWS.COM
నేరేడుచర్ల. పట్టణ ములోని బాలుర ఎస్సీ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి స్థానిక తహసీల్దార్ సైదులు, ఆర్ఐ నరసయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు అకస్మిక తనిఖీ చేశారు. ఎస్సీ హాస్టల్ లో 49 మంది విద్యార్థులు ఉన్నారని తహసీల్దార్ తెలిపారు. వంట గదిలో శుభ్రత పాటించాలని, తాజా కూరగాయలు,ఆహార పదార్థాలతో వంట చేయాలన్నారు. ఆహార పదార్థాలపై మూతలు ఉంచాలని, ఆహారము, నీళ్లు కలుషితం కాకుండా చూడాలన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. వంట సామాగ్రిని, ఆహార పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశీలన నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపనున్నట్లు తహసీల్దార్ తెలిపారు..
కీతవారిగూడెం చేరిన ఉద్యమకారుల సంక్షేమ సంఘం పాదయాత్ర..!

R9TELUGUNEWS.COM
*తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట నుండి భద్రాచలం వరకు చేపట్టిన పాదయాత్ర ఈరోజు గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చేరడం జరిగింది .. వారికి ఘన స్వాగతం పలికిన ఉద్యమకారులు హుజూర్నగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
పిడమర్తి అంజి..
ఈ సందర్భంగా పిడమర్తి అంజి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులకు ప్రత్యేక హోదా కల్పిస్తారని వారికి 242 గజాల ఇంటి స్థలం, మరియు ఇండ్లు కేటాయిస్తానని వారి యొక్క ప్రతి ఒక్క ఆంక్షలు నెరవేరుస్తానని వాగ్దానం చేసిన రేవంత్ ప్రభుత్వం. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి సంవత్సరం కాలం కావస్తున్న ఇంతవరకు ఉద్యమకారుల గురించి ఏలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం వెంటనే ఉద్యమకారులపై సిద్ధ శుద్ధి ఉంటే వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.అలాగే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు తెలుపుతూ దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కు మలిదశ ఉద్యమకారులు తగిన బుద్ధిని చెప్పుతారని వారు పేర్కొన్నారు..