తెలంగాణ భవన్ లో హుజూర్ నగర్ నియోజవర్గ ముఖ్య నాయకులతో brs పార్టీ కేటీఆర్, జగదీష్ రెడ్డి సమావేశం..

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బిజెపి పార్టీలో చేరడంతో ఒక్కసారిగా ఆ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది….

గత శాసనసభ ఎన్నికల్లో మాజీ శానంపూడి సైదిరెడ్డి 45 వేల పైచిలుకు ఓట్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఓడిపోవడం జరిగింది…. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి brs పార్టీకి కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఆదివారం రోజు బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపిలో చేరడంతో ప్రస్తుతం పార్టీకి ఇంచార్జ్ లేకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధుల్ని ముఖ్య నాయకులను తెలంగాణ భవన్ లో యువ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సూర్యాపేట mla జగదీష్ రెడ్డితో సమావేశం నిర్వహించనున్నట్లుగా సమాచారం… ప్రస్తుతం హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జడ్పిటిసి లను, ఎంపీపీ లను కౌన్సిలర్లను ప్రజా ప్రతినిధులను ఉద్యమకారులను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లుగా సమాచారం… పార్టీ ఇన్చార్జిగా ఎవరిని ఉంచాలనే దానిపై కూడా నాయకులతో స్పష్టత తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం…