రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.
రోడ్లపై ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ కోరారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆమె న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులతో కలిసి కోర్టు నుండి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కోర్టు ప్రాంగణంలో సభికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించి వాహనాల నడపడం చట్ట విరుద్ధమన్నారు. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన భద్రత సూచికలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనాలు నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడటం నేరమన్నారు. రోడ్డు నియమాలను ఉల్లంఘించిన వారు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం శిక్షకు అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, నాగేష్ రాథోడ్, ఎంఎస్ రాఘవరావు, కొట్టు సురేష్, పాలేటి శ్రీనివాసరావు, పసుపులేటి వీరు, సైదా హుస్సేన్, నారాయణరెడ్డి, నాగపాష, అడవి రాముడు, రామారావు, స్థానిక ఎస్ఐ మోహన్ బాబు, కోర్టు సిబ్బంది అనిత, సుశీల, పారా లీగల్ వాలంటీర్లు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.