పేదవాడికి వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

*ప్రతి పేదవాడికి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

*మందులు ఉచితంగా పంపిణీ చేయాలి.

*త్వరలో జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం.

*హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి సమీక్ష సమావేశం.

*సూర్యాపేట జిల్లా*

హుజూర్ నగర్ లో 100 పడకల హాస్పిటల్ ను సందర్శిచిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వర రావు లు…
హాస్పిటల్ ను పరిశీలన చేసిన మంత్రులు… పాల్గొన జిల్లా అధికారులు..

*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…*

హుజూర్నగర్ లోని 100 పడకల ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం….

హుజూర్నగర్ లో ఇంత పెద్ద ఎత్తున ఆసుపత్రిని తన హయాంలోనే నిర్మించినట్లు అందరికీ గుర్తు చేశారు… మౌలిక సదుపాయాలు కల్పనకై ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. హాస్పిటల్‌కి వచ్చే పేదవాడికి ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రి పై భరోసా కోల్పోవద్దని అధికారులకు సూచించారు. పేదవారికి విశ్వాసం కలగాలని విశ్వాసం కోల్పోవద్దని అన్నారు. సూర్యాపేట జిల్లాతో పాటు మిగతా జిల్లాలకు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. 45% పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని వాటిని 75 శాతానికి పెంచే విధంగా అధికారులు పనిచేయాలని అన్నారు.ఐదు లక్షల ఉన్న స్కీమును రూ. 10 లక్షలకు పెంచే విధంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద 1800 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం ఇస్తున్నామని. గతంలో ఉన్న వాటికంటే కొన్నిటిని ఆరోగ్యశ్రీలో చేర్చామని దీనికి ఆర్థిక భారం రూ. 420 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. హాస్పిటల్లోనే డాక్టర్‌తో పాటు సిబ్బంది కొరత ఉందని వాటిని త్వరలోనే కాంట్రాక్టర్ పద్ధతిలో భర్తీ చేస్తామన్నారు. ఇటీవల 7000 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేశామని జాబ్ క్యాలెండర్ తయారు చేసి దాని ప్రకారం భర్తీ చేస్తామన్నారు.

సిబ్బంది మౌలిక వసతులు ఏర్పాట్లు పై పూర్తిస్థాయిలో నివేదికని అధికారుల నుండి సేకరించడం జరిగిందని వాటన్నిటిని పూర్తిచేసి,,

సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి.

సూర్యాపేట జిల్లాలో ఉన్న స్థలం కొంత వివాదంలో ఉన్నది దాన్ని త్వరలోనే పరిష్కరిస్తాం..

ఆరు గ్యారెంటీలో భాగంగా ఆరోగ్యశ్రీని పెంచుతూ నిర్ణయాలను తీసుకున్నాం.

ప్రైవేట్ హాస్పిటల్ లకు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేస్తాం..

ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నట్లు తెలిపారు….

ప్రభుత్వ ఆసుపత్రి అన్ని హంగులతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా డాక్టర్లు ప్రతి ఒక్కరూ బాధితంగా వ్యవహరించాలని అన్నారు….

అన్ని ప్రైమరీ సెంటర్లలో కూడా మెరుగైన వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని కోరారు..

*మంత్రి దామోదర నరసింహ మాట్లాడుతూ…*

హుజూర్ నగర్ లో సిబ్బంది కొరత లేకుండా అందర్నీ రిక్రూట్మెంట్ చేయాలని కోరారు…..

అందుకు సంబంధించిన పూర్తి అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దృష్టి పెడుతున్నది విద్య వైద్యం,, ఈ రెండు బాగుంటే నిరుపేదలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అన్నారు..

అందుకనే ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండేలా డాక్టర్లు పని చేయాలని తెలిపారు..

హాస్పిటల్లోనే పేషెంట్లను వార్డులను పరిశీలించి పేషెంట్లు డాక్టర్లు అందిస్తున్న వైద్యం గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ డైరెక్టర్, హెల్త్, విద్య పరిషత్ అధికారి జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే , డీఎంహెచ్‌వో కోటాచలం, అడిషనల్ కలెక్టర్లు, వెంకటరెడ్డి, ప్రియాంక, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, హాస్పిటల్ సూపర్నెంట్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు…