హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు..

సూర్యాపేట జిల్లా..
హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు,,

చింతలపాలెం మండలం నక్కగూడెంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేసిన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి,, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

*మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ..*

ప్రజలు కట్టే ప్రతి రూపాయిలు కూడా ప్రజల కోసమే ఖర్చు చేసే విధంగా ఓ ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు… గతంలో మహిళలందరికీ డ్వాక్రా పథకం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాము.,.. అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ముందుకు ఎలా నడిపించాలోని అందరం కూర్చుని ఓ నిర్ణయం తీసుకొని అభివృద్ధిని విధంగా ప్రణాళిక బద్ధంగా నడిపిస్తున్నామని అన్నారు..

ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకటో తారీకున జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది..

ప్రజలందరూ బాగుండాలి , రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండాలి..

పది సంవత్సరాల పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందించడంలో కొంత వెనుకబడిపోయింది…

*మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.*

నాగార్జునసాగర్ డ్యాం కట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే… కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి వీరికి అసలు డ్యామే కట్టడం రాదు నాగార్జునసాగర్ డ్యాం కూడా సరిగా లేదు అంటూ , ఇక్కడ కాదు మరో దగ్గర కట్టాలి అంటూ సలహాలు సూచనలు ఇచ్చారని… 70 సంవత్సరాలైనా కానీ నాగార్జునసాగర్ డ్యాము చెక్కుచెదరలేదని..

ఆయన కట్టిన కాలేశ్వరం డ్యామ్ మూడు సంవత్సరాల్లోనే కృంగిపోయిందన్నారు…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో,,కేసీఆర్ ఏ కృష్ణానది నీటిని జగన్ మోహన్ రెడ్డి తరలించారు..

కృష్ణానదిలో నీరు లేకపోవడం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ చేతకానితనం వల్లనే నేడు కృష్ణానదిలో ఈరోజు నీరు లేకుండా పోయింది..

దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు..

గతంలో దోపిడీ విధానం కొనసాగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అలా ఉండదు. ప్రతి ఒక్కరికి నిజంగా నిజాయితీగా న్యాయం జరుగుతుంది అన్నారు….

*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ* ..

కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఆరు గ్యారెంటీలని అమలు చేస్తుంది..

ఆరుగారింటిలో భాగంగా ఉచితంగా 200 యూనిట్ల వరకు గృహాలకి అందించడం జరుగుతుంది ఆ పథకం మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది..

వంటింటి మహిళ ఇబ్బంది పడకూడదని విపరీతంగా పెరిగిపోతున్న గ్యాస్ ధరలను దృష్టిలోనే ఉంచుకొని కేవలం 500 రూపాయలకు మాత్రమే గ్యాస్ ని అందించడం జరుగుతుందని తెలిపారు..

కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు.. 7 లక్షల కోట్లు అప్పుచేసి కెసిఆర్ కుటుంబం బాగుపడింది… శ్రీశైలంలోని సొరంగా మార్గాన్ని ఉత్తంకుమార్ రెడ్డి హయాంలోనే పూర్తి చేసుకోబోతున్నాం.. దీంతో ఐదు లక్షల ఎకరాల కు మీరందుతుంది.. అది రెండు సంవత్సరాల్లోనే పూజ అవుతుంది..

గతంలో ముఖ్యమంత్రిని, మంత్రులను కలవాలంటే చాలా తిప్పలు పడే వారు.. కానీ ఇప్పుడు అలా ఉండదు ఇది ప్రజా పాలన అని అన్నారు..

నక్కగూడెం నుండి దొండపాడు వెళ్తూ గ్రామం మధ్యలో కూలీలతో ముచ్చటించిన మనసులు,, ప్రభుత్వం ఇవ్వబోతున్న ఆరు గ్యారెంటీ లపై మహిళలకి వివరించడం జరిగింది..