*హుజూర్ నగర్ లో విద్యార్థిని ఆత్మహత్య..*
*విద్యార్థిని ఆత్మహత్యపై ఇంకా రాని క్లారిటీ* ..
*కొత్త పరిచయాలు వద్దు అన్న అందుకే,, తల్లిదండ్రులకు చెప్తారేమో అన్ భయంతో ఆత్మహత్య..!!*
*సరైన వసతులు లేని బిల్డింగ్..!*
*కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు లేని వైనం..!*
*మూడు నెలల క్రితమే హాస్టల్లోకి ప్రవేశించిన ఆకతాయి…!*
*బిల్డింగ్ చుట్టూ సమస్యలే అసలు బిల్డింగే సమస్య అంటున్న తల్లిదండ్రులు..!*
*అద్దె భవనంలో కూడా తప్పని ఇక్కట్లు..!*
*సూర్యాపేట జిల్లా..*
హుజూర్ నగర్ లోని బిసి వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో తోమిదోతరగతి శివాని నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం చెందిన విద్యార్థిని పాఠశాలలో ఉరివేసుకొని ఆత్మహత్య…….
*ప్రిన్స్ పాల్..అనితా..*
*Spt భరణి తెలిపిన వివరాల ప్రకారం..*
తోమిదోతరగతి చదువుతున్న శివాని నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం చెందిన విద్యార్థిని అసలు సూసైడ్ ఎందుకు చేసుకుందో కూడా తమకు అర్థం కావడం లేదని విద్యార్థినిలు ఎప్పుడూ కూడా మేము ఏ విషయంలో ఒత్తిడికి గురి చేయలేదని,, అటువంటి అవసరం కూడా ఉండేది కాదని అన్నారు … కాకపోతే ఇటీవల
ఎనిమిది మంది అమ్మాయిల తీరు .. కొంత అనుమానస్పదంగా ఉండడంతో.. వాళ్ల తల్లిదండ్రులని పిలిపించమని అడగడం జరిగిందని అన్నారు..
దీంతో ఒక ఏడుగురు వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించడం జరిగిందని వాళ్ళ తల్లిదండ్రులకు అర్థమయ్యేలా విషయాన్ని వివరించామని తెలిపేరు…
తెలిసే తెలవని వయసులో సోషల్ మీడియాకి కొంత దగ్గర కావడం ఒకరిద్దరు కిటికీ వద్ద కూర్చొని వేరొక విద్యార్థులకు హాయ్ అంటూ చేతులు ఊపటం గమనించామని..
ఇది సరైన పద్ధతి కాదు అంటూ తల్లిదండ్రులని వివరించమని పిలిపించడం కూడా జరిగిందని,, ఏడుగురు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లలకి సర్ది చెప్పి ఇంటికి తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ తీసుకోవచ్చి స్కూల్లో వదిలారని… ప్రస్తుతం శివాని వాళ్ల తండ్రి అందుబాటులో లేకపోవడంతో తర్వాత వచ్చి తీసుకువెళ్తానని చెప్పడం జరిగిందని అన్నారు..
ఇదంతా కూడా ఇది స్టూడెంట్స్ తమకు చెప్పారని,, మేము కేవలం కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చామని, మరోసారి ఇలా చేయకండి అని వారిని కొంత మోటివేషన్ చేయడం జరిగిందని తెలిపారు..
*తల్లిదండ్రులు,, కుటుంబీకుల ఆరోపణలు..*
బిల్డింగ్ సరిగా లేదని… నీళ్లు కూడా కనీసం పిల్లలకు సరిపోవడంలేదని అద్దె భవనంలో కూడా ఇంత అసౌకర్యాలు ఏమిటని..
చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం ఉన్నది కేవలం నాలుగడుగులు మించి ఎత్తు లేకపోవడం విద్యార్థినిల గదుల్లో రోడ్డుపై వెళ్లే వాళ్ళు కూడా చూసేలా ఉండటం చాలా బాధాకరమని అన్నారు….
కనీసం సీసీ కెమెరాలు లేకపోవడం చుట్టూ కూడా విద్యార్థినిలు బయటకి కనబడకుండా కనీసం ఐరన్ తో ఏర్పాటు కూడా చేయకపోవడం వలన ఇలాంటి తపదాలు జరుగుతున్నాయని అంటున్నారు…… గతంలో కూడా ఉగాంతకుడు తాగి విద్యార్థినీల రూములోకి వచ్చి హడావుడి సృష్టించడం జరిగిందని ఆ వ్యక్తికి విద్యార్థినీలే దేవ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించామని తెలిపారని అన్నారు….. ఆ ఘటన జరిగి మూడు నెలలు కూడా కాకముందే ఇంకా పూర్తి ఏర్పాట్లు కూడా చేయకపోవడం విద్యా అధికారుల అలసత్వమేనని అన్నారు…… చదువుకై పంపించిన తమ కూతురు పాడ మీదకెక్కడం తమకు ఎంతో తీవ్ర విషాదని మిగిల్చిందని కన్నీరు మున్నీరుగా శివాని తల్లి విలపించింది…..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి విచారణ చేపట్టిన అనంతరం మిగతా వివరాలు తెలుపుతామని తెలిపారు..