హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా కోతి సంపత్ రెడ్డి..

*హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా కోతి సంపత్ రెడ్డి*

హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా కోతి సంపత్ రెడ్డి ఎన్నికయ్యారు. బుదవారం మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి అధ్యక్షత జరిగిన కౌన్సిల్ సమావేశం లో ప్రత్యేక అధికారి హుజూర్ నగర్ ఆర్ డీ ఓ జగదీష్ రెడ్డీ ఆద్వర్యం లో వైస్ చైర్మన్ ఎన్నిక జరగ గా 12వార్డ్ కౌన్సిలర్ వెలిదండ సరిత ప్రతిపాదించగా 22 వార్డ్ కౌన్సిలర్ అమరబోయిన సతీష్ బలపరచి 21 మంది కౌన్సిలర్స్ఆమోదం తో కాంగ్రెస్ పార్టీ కీ చెందిన 3 వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు…..

ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ ..

మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గేల్లి అర్చన రవి సహకారాలతో,, అభివృద్ధి పథంలో తన వంతు తోడ్పాటు ఇస్తానని.. తన వేస్ చైర్మన్ ఎన్నికకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన కౌన్సిలర్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు….