తుపాకితో దోపిడీకి ప్రయత్నించిన ఇద్దరు దొంగల అరెస్ట్..

తల్లీకుమార్తెల ధైర్యానికి దుండగుల పరార్‌.. బేగంపేటలో ఘటన.

తల్లీకుమార్తెల ధైర్యానికి దుండగుల పరార్‌.. బేగంపేటలో ఘటన..

హైదరాబాద్ బేగంపేట ప్రాంతంలోని రసూల్‌పుర జైన్‌ కాలనీలో నవరతన్‌ జైన్‌ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
గురువారం కొరియర్‌ డెలివరీ బాయ్ రూపంలో పట్టపగలు తుపాకీతో ఇంట్లోకి చొరబడి దోపిడీ కోసం బెదిరించిన దుండగుల్నినవరతన్‌ జైన్‌ భార్య అమిత మేహోత్‌ ధైర్యంగా నిలబడి నిందితుడితో కలబడిందని పోలీసులు తెలిపారు.
మధ్యాహ్నం 2 :15 గంటల సమయంలో ఇద్దరు సాయుధ వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అమిత, ఆమె కుమార్తెను పిస్టల్‌తో బెదిరించారు.
సంఘటన CCTV ఫుటేజీలో రికార్డు అయ్యింది. దుండగుల్లో ఒకరు హెల్మెట్ ధరించి నాటు తుపాకీని ఆమెకు గురిపెట్టాడు.
మరొక దుండగుడు ఇంటి పనిమనిషి మెడపై కత్తి పెట్టి ఆపై ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని కోరాడు..

బీహార్ కి చెందిన ఇద్దరు దొంగలను అరెస్ట్…

బేగంపేట్ లోని పైగా హౌసింగ్ కాలనీలో నిన్న తుపాకితో దోపిడీకి ప్రయత్నించిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన బేగంపేట్ పోలీసులు..

బీహార్ కి చెందిన ప్రేమ్ చంద్, సునీల్ కుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు..

హౌస్ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు నిందితులు..

అమిత ఇంట్లో కొద్దీ రోజుల క్రితం దీపావళి పండుగ సందర్భంగా ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చిన నిందితులు..

ఆ సమయంలో ఇంట్లో భారీగా డబ్బులు, బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలుసుకొని నిన్న దోపిడీకి ప్రయత్నించిన దొంగలు..

అమిత ఆమె కూతురు ఇద్దరు కలిసి దొంగలపై తిరిగి దాడి చేయడంతో పారిపోయిన నిందితులు..