దేశవ్యాప్తంగా అత్యంత సంచలనం రేపుతున్న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసు..!!

బాధిత బాలిక వద్ద మరోసారి వాగ్మూలం తీసుకోనున్న పోలీసులు..!

మిగతావారి పాత్రపై అనుమానాలు..
*వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కొడుకు సహా ఇద్దరు మైనర్లు జువైనైల్‌ కోర్టులో హాజరు..!
ఎమ్మెల్యే కొడుకు ఎ6!..పోలీసుల అదుపులో సంగారెడ్డి ప్రజాప్రతినిధి కుమారుడు..ఊటీలో ఉమర్‌ అలీఖాన్‌…బాధిత బాలిక వద్ద మరోసారి వాగ్మూలం తీసుకోనున్న పోలీసులు..

*ఇన్నోవా స్వాధీనం..!

బెంజ్‌ కారులో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటారా ..!*సాంకేతిక ఆధారాలపై అధికారుల దృష్టి సీబీఐ విచారణ చేయాలి..

*రేప్‌ జరిగినా తరువాత ఎఫ్‌ఐఆర్‌కు 3 రోజులా సమయం పట్టింది…

పబ్‌లోకి మైనర్లకు అనుమతి ఎలా?. ఇచ్చారు అంటు ప్రశ్నలు…పబ్‌ యాజమాన్యంపై కేసు పెట్టండి అంటు రాజకీయ నాయకులు ఆరోపణలు..
పేపర్ వాల్ పార్టీ చేసుకుంటామంటే అనుమతి ఇచ్చాం అది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది అంటున్నారు నిర్వాహకులు..
..పోలీసులకు బాలల కమిషన్‌ ఆదేశం..
దేశంలో అత్యాచారాలు బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి అనే అది కూడా అత్యంత ఘోరంగా జరుగుతూ ఉంటాయి అంటే దాదాపు ప్రచారంలో ఉన్నది… కానీ సమాజం సిగ్గుపడేలా తెలుగు రాష్ట్రంలో ఇంత క్రూరంగా బాలికపై అత్యాచారం చేసిన ఘటన తెలంగాణలో జరగటం.. జరిగిన ఘటనపై ఇప్పటివరకు కూడా అలసత్వం వహించడం.. పలు రకాల విమర్శలకు దారి తీసింది… హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో శనివారం పోలీసులు మరో ఇద్దరు మైనర్‌ బాలలను అదుపులోకి తీసుకుని జువైనైల్‌ కోర్టులో హాజరుపర్చారు. వీరిలో ఒకరు వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు. మరో మైనర్‌ నెల్లూరు పారిపోతుండగా పట్టుకున్నారు. ఐదో నిందితుడైన మైనర్‌ను సంగారెడ్డి ప్రజా ప్రతినిధి కుమారుడిగా పోలీసులు గుర్తించారు. అతడిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, కేసులో హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరు ప్రముఖంగా వినిపించింది.
తొలుత.. సీసీ ఫుటేజీ పరిశీలన ద్వారా అతడికి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. బాలికతో అతడు కూడా పబ్‌ నుంచి బేకరీకి వెళ్లాడు. తిరిగివచ్చేటప్పుడు మాత్రం ఇన్నోవా వాహనం ఎక్కలేదు. దీంతో అతడి పాత్ర నిర్ధారణ కాలేదని పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ శుక్రవారం ప్రకటించారు. ఇదిలా ఉండగా బాలికతో కలిసి ఎమ్మెల్యే కుమారుడు బెంజ్‌ కారులో ప్రయాణిస్తున్న చిత్రాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీటిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యే కుమారుడు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఆ వీడియోను చూసిన పోలీసులు మైనర్‌ అయిన ఎమ్మెల్యే కుమారుడి పేరును ఎ-6 గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే ప్రయత్నాలు ఆరంభించారు. ఈ నేపథ్యంలో బాధితురాలి వద్ద పోలీసులు మరోసారి వాగ్మూలం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్యే కుమారుడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతారు. బాధితురాలి వాగ్మూలాన్ని సెక్షన్‌ 164 కింద జడ్జి ఎదుట రికార్డు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా సీసీ పుటేజీతో పాటు సాంకేతిక ఆధారాలపై పోలీసులు దృష్టి సారించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సాయంతో నిందితులతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ మొదలు పెట్టారు. కాగా, కేసులోని ఇద్దరు మేజర్లలో సాదుద్దీన్‌ మాలిక్‌ (18)ను శుక్రవారమే అరెస్టు చేశారు. ఇతడికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మరో నిందితుడు ఉమర్‌ అలీఖాన్‌ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అతడు ఊటీలో ఉన్నట్టు సమాచారం రావడంతో ఓ బృందాన్ని పంపించారు. మరో రెండు బృందాలు కర్ణాటక, తెలంగాణలో గాలింపు చేపట్టాయి. .మిగతావారి పాత్రపై అనుమానాలుఈ కేసులో ఇప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక, కొంతమంది మైనర్లు కలిసి ప్రయాణిస్తున్న కారులోని కొన్ని దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అసలు సంఘటన జరిగింది బెంజ్‌ కారులోనా? లేదా పోలీసులు చెబుతున్నట్టు ఇన్నోవా కారులోనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పబ్‌ నుంచి బేకరీకి వెళ్లేటప్పుడు రెండు కార్లలో పదిమంది ఉండగా తిరుగు ప్రయాణంలో ఐదుగురు మాత్రమే ఉన్నారు. పోలీసులు ఈ ఐదుగురే నిందితులని తేల్చారు. మిగతావారికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఇలా క్లీన్‌చిట్‌ ఇచ్చినవారిలో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు. తాజాగా అతడి పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ మిగతా నలుగురి పాత్ర గురించి స్పష్టత ఇవ్వలేదు.
పబ్‌ నుంచి వెళ్లేటప్పుడు బాలిక బెంజ్‌లో నలుగురితో కలిసి ఎక్కినట్టు సోషల్‌ మీడియాలో ఉన్న వీడియోల ద్వారా తెలుస్తోంది. వీటిలో మైనర్లు.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్లీన్‌చిట్‌ ఎలా ఇస్తారు? అనేది పోలీసులే సమాధానం చెప్పాలి. సంఘటన జరిగింది ఇన్నోవా కారులో అని పోలీసులే చెబుతున్నారు. ఇలాంటప్పుడు బెంజ్‌ను ఎందుకు సీజ్‌ చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, బెంజ్‌ను సీజ్‌ చేసి.. అందులో ఉన్న ప్రయాణించినవారిని వదిలేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తొలుత పరిచయమైన ఆ ఒక్కడి పేరుతోనేదారుణంపై బాధిత బాలిక రెండు రోజుల వరకు పోలీసులకు సరిగ్గా సమాచారం ఇవ్వలేకపోయింది. భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్‌తో నోరు విప్పింది. పబ్‌లో పార్టీలో తొలుత ఓ మైనర్‌, అతడి ద్వారా మరో 9 మంది పరిచయం అయ్యారని తెలిపింది. కాగా, మొదట పరిచయమైన ఆ మైనర్‌ పేరును మాత్రమే చెప్పగలిగింది. ఆ పేరు ద్వారా మిగతావారి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాలిక చెప్పిన పేరున్న మైనర్‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా మిగతావారిని గుర్తించారు. అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించి అసలు నిందితుల వివరాలను సేకరించారు. ఆ ఒక్క పేరు కూడా బాలిక చెప్పకపోయి ఉంటే నిందితులను పట్టుకునేందుకు పోలీసులకు మరికొంత సమయం పట్టి ఉండేది..

హోంమంత్రి మనవడే సూత్రధారీ.. ఎమ్మెల్యే రఘునందన్ రావు...

హోంమంత్రి మనవడు, పీఏ పాత్రపై నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి మనవడే సూత్రధారంటూ రఘునందన్ రావు ఆరోపించారు. పబ్‌లో పార్టీ బుక్ చేసిందే హోంమంత్రి మనవడని ఆయన పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ (mim) ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు, పాతబస్తీకి చెందిన ఓ ప్రముఖ దినపత్రిక డైరెక్టర్ కొడుకు , హోంమంత్రి మనవడు , హోంమంత్రి పీఏ హరిలు సీసీటీవీ ఫుటేజ్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నారని రఘునందన్ రావు చెబుతున్నారు.

హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలి…సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క...

జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనర్ బాలిక ఫై గ్యాంగ్ రేప్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ అత్యాచారం ఘటన వెనుక రాజకీయ నేతలు కొడుకుల ప్రమేయం ఉండడం తో వీరిని తప్పించే ప్రయత్నం చేస్తుందని ప్రతిపక్ష పార్టీ లు , ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ ఘటన పట్ల సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నగరంలో పబ్, డ్రగ్స్ లను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇష్టానుసారంగా మద్య విక్రయాలు చేపట్టడమే కాకుండా… పబ్బులకు అనుమతులు ఇస్తుండడంతో పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.