హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఐటీ సోదాలు….

*ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుని తో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు.

హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఐటీ సోదాలు..

100 టీములతో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు..

*శంషాబాద్.

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ వ్యాపారవేత ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు…

ఉదయం నుండి కొనసాగుతున్న సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు..

హైదరాబాద్‌లోని పలుచోట్ల ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో 100 టీంలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కంపెనీలతో పాటు వ్యాపారుల ఇళ్లలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లిలోని హిందూ ఫార్చ్యూన్‌లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ సోదరుల నివాసంతో పాటు వ్యాపారవేత్తలు ప్రసాద్‌, కోటేశ్వరరావు, రఘువీర్‌ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. కేపీహెచ్బీ లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో ఆదాయ పన్ను అవకతవకలకు సంబంధించి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు తమిళనాడులోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నలభై చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎంకే ఎంపీ జగత్‌ రక్షకన్‌ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి..

*ఎల్లారెడ్డి గూడ లోని పూజ కృష్ణ చిట్ ఫండ్స్ సంస్థపై ఐటీ సోదాలు.

డైరెక్టర్స్ సోంపల్లి నాగ రాజేశ్వరి, పూజ లక్ష్మీ, ఎండి కృష్ణ ప్రసాద్ ఇళ్లపై కూడా ఐటీ సోదాలు.