హైదరాబాద్ కేపీహెచ్‌బీ లోని ఓ ఇంట్లో వ్యభిచారం..

హైదరాబాద్ కేపీహెచ్‌బీ లోని ఓ ఇంట్లో వ్యభిచారం (Prostitution) నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం దాడి చేసింది. కాలనీలోని (Colony) రోడ్ నంబరు 2, 3 మధ్యనున్న ఓ ఇంట్లో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారాన్ని అందుకున్న అధికారులు ఆ ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు. ఆ సమయంలో ఓ విటుడు, యువతితోపాటు ఉన్న అక్కడ పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు…వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారయ్యాడు. అదుపులోకి తీసుకున్న ముగ్గురినీ వారు కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. అనంతరం యువతిని పోలీసులు రెస్క్యూ హోంకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వ్యభిచార గృహ నిర్వాహకుడి కోసం గాలిస్తున్నారు…