హైద‌రాబాద్‌ లొ భారీ వర్షం కురిసే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..!!!

హైద‌రాబాద్‌ను ముసురు క‌మ్మేసింది.
న‌గ‌రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. హ‌య‌త్‌న‌గ‌ర్‌, అబ్దుల్లాపూర్‌మెట్ త‌దిత‌ర ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. న‌గ‌రంలో మంగ‌ళ‌వారం, రాత్రి భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉండ‌టంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అవ‌స‌ర‌మైతే త‌ప్ప ప్ర‌జ‌లు ఇండ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని జీహెచ్ఎంసీ హెచ్చ‌రించారు.ఇక రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఇవాళ‌, రేపు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది..భారీ వ‌ర్షం కురుస్తుంద‌నే హెచ్చ‌రిక‌ల‌తో క్షేత్ర‌స్థాయిలో డీఆర్ఎఫ్ బృందాల‌ను జీహెచ్ఎంసీ రంగంలోకి దించింది. సికింద్రాబాద్‌, అల్వాల్‌, నెరేడ్‌మెట్ త‌దితర ప్రాంతాల్లో ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోదయ్యే సూచ‌న‌లు చేస్తున్నరు..