హైదరాబాద్‌లో వర్షం.. రాబోయే మూడు గంటల్లో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన….

ఇటీవల వర్షాలు పాలు నగరాల్లో కుంభవృష్టిగా పడుతున్నాయా.. గతంలో హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు సిటీలో ప్రజలు మదిలో మెదులుతునే ఉన్నది…జంటనగరాల పరిధిలో శనివారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. మెహదీపట్నం, బంజారాహిల్స్‌, గుడిమల్కాపూర్‌, లంగర్‌ హౌస్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, అంబర్‌పేట, బాగ్‌ అంబర్‌పేట, కూచికూడలో వానపడింది. అబిడ్స్‌, నాంపల్లి, కోఠి, బషీర్‌బాగ్‌, ఖైరతాబాద్‌, నారాయణగూడ, అఫ్జల్‌గంజ్‌, గోషామహల్‌, మంగల్‌హాట్‌, సికింద్రాబాద్‌, పద్మారావ్‌నగర్‌, చిలుకలగూడ, సీతాఫల్‌మండి, వారాసిగూడ, బౌద్ధనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. నీరు నిల్వకుండా అధికారులు చర్యలు చేపట్టారు.