హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వరద.. భారీగా నిలిచిపోయిన వాహనాలు.. దారి మళ్లింపు..!..

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వరద.. భారీగా నిలిచిపోయిన వాహనాలు..

*నందిగామ హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే..

శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్‌గేట్‌ నుంచి విజయవాడ వైపు సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి..

దీంతో హైదరాబాదు నుండి కోదాడ to విజయవాడ వెళ్లే వెహికల్ అన్నిటిని కూడా హుజూర్నగర్ మీదుగా మట్టపల్లి వంతెన పై నుండి దాచేపల్లి వెళ్లేలా దారిని మళ్ళించడం జరిగింది..